90 Year Old Woman Graduation : 90 ఏళ్ల వయసులో డిగ్రీ పూర్తి చేసిన వృద్ధురాలు
90 Year Old Woman Graduation : చిన్న పిల్లలు సైతం కళ్లజోడు పెట్టుకుని పరీక్ష రాస్తున్న నేటి చదువుల ప్రపంచంలో 90 సంవత్సరాల వృద్ధాప్యంలో కూడా డిగ్రీ పూర్తి (90 Year Old Woman Graduation) చేసి..సంకల్పం ముందు వయసు తో సంబంధం లేదని నిరూపించింది
- By Sudheer Published Date - 08:02 PM, Thu - 12 December 24

చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించింది ఈ బామ్మ. చిన్న పిల్లలు సైతం కళ్లజోడు పెట్టుకుని పరీక్ష రాస్తున్న నేటి చదువుల ప్రపంచంలో 90 సంవత్సరాల వృద్ధాప్యంలో కూడా డిగ్రీ పూర్తి (90 Year Old Woman Graduation) చేసి..సంకల్పం ముందు వయసు తో సంబంధం లేదని నిరూపించింది. ఈ వయసులో డిగ్రీ పూర్తి చేసి అందరికి ఆదర్శమైంది. చదవాలనే తపన ఉండేలకని ఎన్ని అడ్డాకుల ఎదురైనా..ఎంత వయసైనా చదువు ముందు తక్కువే అని ఈమె నిరూపించింది. ఈమె డిగ్రీ ముందు వృద్ధాప్యం కూడా చిన్నబోయింది. ఇంతకీ ఈమె ఎవరంటే.. అమెరికా(USA)లోని న్యూ హాంప్ షైర్ (New Hampshire)కు చెందిన 90 ఏళ్ల రాబర్ట్ అనే వృద్ధురాలు (90 Year Old Woman Rabart).
న్యూ హాంప్ షైర్ కాలేజీ నుంచి తాజాగా డిగ్రీ పట్టా( Graduation) అందుకొని, తాను కలలుగన్న విద్యార్హతను సాధించి అందరికి ఆదర్శమైంది. ఇది కేవలం ఆమె కుటుంబానికే కాదు, సమాజానికి కూడా ప్రేరణగా నిలిచింది. ఆమె జీవిత పరిస్థితుల వల్ల చదువును పూర్తి చేయలేకపోయింది. భర్తను కోల్పోయిన తర్వాత ఆమె మధ్యాహ్న భోజనం వండే పని, బీమా ఏజెంటుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చింది. అయినప్పటికీ, తన చదువు సాధించాలనే సంకల్పాన్ని దాచి పెట్టలేదు. ఏదైనా మొదలుపెడితే దానిని పూర్తి చేసే వరకూ నిద్రపోనని ఆమె ప్రతిజ్ఞ చేసుకోవడం గమనార్హం.
ఇక రాబర్ట్‌కు ఐదుగురు పిల్లలు, 12 మంది మనవళ్లు, 15 మంది మునిమనవళ్లు ఉన్నారు. అయినప్పటికీ ఎలాగైనా డిగ్రీ పూర్తి చేయాలనీ కష్టపడి.. డిగ్రీ పట్టా పొంది అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. వయస్సు పెద్ద సమస్య కాదు, కేవలం మనిషి సంకల్పమే ముఖ్యమని ఆమె చాటి చెప్పింది. ఈమె విజయాన్ని ఆమె బిడ్డలు మరియు మనవరాళ్లు, మునిమనవరాళ్లు సైతం గర్వంగా చెప్పుకుంటున్నారు. జీవితంలో ఏదైనా సాధించడానికి వయస్సు అడ్డంకి కాదు. విద్యలాంటి లక్ష్యాలను సాధించాలంటే ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉండాలి. అనేక కష్టాలు ఎదురైనా ఆమె ఆత్మస్థైర్యంతో విజయం సాధించగలిగారు. రాబర్ట్ జీవిత ప్రయాణం సమాజానికి ఒక గుణపాఠం అని చెప్పి. అనేక మంది వ్యక్తులు వయస్సు పెరిగిన తర్వాత తమ కలలను వదిలేస్తుంటారు. అయితే, రాబర్ట్ మాత్రం ఒక నూతన ధైర్యాన్ని ఇచ్చింది. “మనం ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యం” అనే నిజాన్ని ఆమె నిరూపించింది.
Read Also : Puri Musings : ‘‘లైఫ్‌లో ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి ?’’ పూరి జగన్నాథ్ సూపర్ టీచింగ్స్