240 Gold Coins Vs 4 Police : గోల్డ్ కాయిన్స్ దొంగిలించిన నలుగురు పోలీసులు.. బ్రిటీష్ కాలం నాటి 240 కాయిన్స్ మిస్టరీ
240 Gold Coins Vs 4 Police : పోలీసులు దొంగలను పట్టుకుంటారు.. కానీ మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్‌లో పోలీసులే ఓ గిరిజనుడి ఇంట్లో దొంగతనానికి తెగబడ్డారు.
- By Pasha Published Date - 04:05 PM, Sun - 27 August 23

240 Gold Coins Vs 4 Police : పోలీసులు దొంగలను పట్టుకుంటారు.. కానీ మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో పోలీసులే ఓ గిరిజనుడి ఇంట్లో దొంగతనానికి తెగబడ్డారు. ఒక ఇన్‌స్పెక్టర్, ముగ్గురు కానిస్టేబుళ్లు సిివిల్ డ్రెస్ లో గిరిజనుడి ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులను తిట్టారు, కొట్టారు. వారితో అమానుషంగా ప్రవర్తించారు. అంతేకాదు.. ఆ ఇంట్లో దాచి ఉన్న బ్రిటీష్ కాలం నాటి 240 బంగారు నాణేల్లో 239 నాణేలను తీసుకెళ్లారు. ఒకే ఒక బంగారు నాణేన్ని ఆ గిరిజన ఫ్యామిలీకి వదిలి వెళ్లారు. కట్ చేస్తే.. ఆ గిరిజన ఫ్యామిలీ ఫిర్యాదుతో ఆ నలుగురు ఖాకీ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని విధుల నుంచి సస్పెండ్ కూడా చేశారు. ఈ మొత్తం ఘటన సోంద్వా డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని బెజ్డా దగ్దా ఫాలియా గ్రామంలో చోటుచేసుకుంది.
Also read : Fake Pilot: అమ్మాయిల కోసం పైలెట్ అవతారం ఎత్తిన వ్యక్తి.. చివరికి అలా?
ఇంతకీ మధ్యప్రదేశ్ లోని ఆ గిరిజన ఫ్యామిలీకి 240 గోల్డ్ నాణేలు (240 Gold Coins Vs 4 Police) ఎక్కడి నుంచి వచ్చాయి ? బ్రిటీష్ కాలం నాటి గోల్డ్ కాయిన్స్ వారికి ఎక్కడ దొరికాయి ? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయా? వీటికి సమాధానం ఏమిటంటే.. గిరిజనుడు రామ్‌కు భైద్య, అతడి కోడలు బజ్రీ ఇటీవల గుజరాత్‌లో లేబర్ వర్క్ కోసం వెళ్లారు. అక్కడ ఓ స్థలంలో తవ్వకం పనులు చేస్తుండగా బ్రిటీష్ కాలం నాటి 240 బంగారు కాయిన్స్ తో ఉన్న సంచి ఒకటి దొరికింది. దాన్ని వాళ్లు తీసుకొచ్చి.. మధ్యప్రదేశ్ లోని బెజ్డా దగ్దా ఫాలియాలో ఉన్న తమ ఇంట్లో గుంత తవ్వి దాచిపెట్టారు. ఏదో ఒక రకంగా ఆ విషయం ఊరిలోని వాళ్లకు తెలిసింది. వారి ద్వారా పోలీసుల చెవిలో ఆ మాట పడింది. దీంతో జులై 19న నలుగురు పోలీసులు మఫ్టీలో వచ్చి.. గిరిజనుడు రామ్ కు భైద్య కుటుంబ సభ్యులను బెదిరించి గోల్డ్ కాయిన్స్ తీసుకొని పరారయ్యారు. ఈ నాణేల విలువ కోట్ల రూపాయలు ఉండొచ్చని గిరిజన ఫ్యామిలీ చెబుతోంది.