Uttarpradesh: 7 నెలల చిన్నారి కడుపులో రెండు కిలోల పిండం.. ఫొటోస్ వైరల్?
మామూలుగా చిన్న పిల్లలకు చిన్న దెబ్బ తగిలిన లేదంటే కడుపు నొప్పి వచ్చిన దాన్ని బయటకు చెప్పుకోలేక ఏడుస్తూ లోలోపల బాధపడుతూ ఉంటారు. అలాంటిది ఏకంగ
- By Nakshatra Published Date - 03:45 PM, Sun - 30 July 23
మామూలుగా చిన్న పిల్లలకు చిన్న దెబ్బ తగిలిన లేదంటే కడుపు నొప్పి వచ్చిన దాన్ని బయటకు చెప్పుకోలేక ఏడుస్తూ లోలోపల బాధపడుతూ ఉంటారు. అలాంటిది ఏకంగా ఏడు నెలల చిన్నారి కడుపులో పిండం ఉంది. వినడానికి షాకింగ్ గా ఉన్న ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లో ఒక ఏడు నెలల బాలుడు కడుపులో పిండం ఉందని తెలుసుకున్న ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆ హాస్పిటల్స్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగారు. రోజురోజుకీ ఆ చిన్నారి ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది తప్ప వారు మాత్రం తల్లిదండ్రులు ఏం చేయలేకపోయారు.
ఇక రోజు రోజుకి ఆ బాలుడి కడుపు ఉబ్బి పోవడంతో అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భయందోళనలకు గురయ్యారు. చేసేదేం లేక ఇటీవల ఓ మంచి డాక్టర్ ను సంప్రదించారు. దీంతో ఆ వైద్యుడు బాలుడిని పరిశీలించి అతపి కడుపులో పిండం ఏర్పడిందని గుర్తించారు. ఆ తర్వాత శస్త్ర చికిత్సతో వైద్యులు విజయవంతం ఆ పిండాన్ని తొలగించారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో పరిధిలోని ఒక ప్రాంతంలో ఒక దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఏడు నెలల కిందట ఒక మగబిడ్డ జన్మించాడు. కొడుకు పుట్టడంతో ఆ దంపతుల ఆనందానికి అవదుల్లేవు. ఇక ఆ చిన్నారిని ప్రేమగా చూసుకుంటూ పెంచుతున్నారు. ఈ క్రమంలోనే ఆ బాలుడు కడుపు రోజు రోజుకు ఉబ్బిపోతూ కనిపించింది.
దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు గమనించి దగ్గర్లోని ఒక వైద్యునికి చూపించారు. అలా కొన్ని రోజులు గడిచింది. కాగా, రోజు రోజుకు ఆ బాలుడి కడుపు ఉబ్బిపోతుంది తప్పా తగ్గడం లేదు. ఇక ఆ బాలుడి తల్లిదండ్రులు భయపడిపోయారు. వెంటనే ప్రయాగ్రాజ్లో ఉన్న ఒక వైద్యుడిని స్పందించారు..పరీక్షించిన వైద్యులు బాలుడి కడుపులో పిండం ఏర్పడిందని గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ చిన్నారి తల్లిదండ్రులు షాక్ గురయ్యారు. ఖంగారుపడాల్సిన పని లేదని వైద్యులు ఆ దంపతులకు ధైర్యాన్ని ఇచ్చారు. ఆ తర్వాత శస్త్రచికిత్స ద్వారా వైద్యులు ఆ బాలుడి కడుపులో ఉన్న 2 కిలోల పిండాన్ని విజయవంతంగా బయటకు తీశారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ.. కడుపులో పిండం అభివృద్ధి చెందిందని, గర్భాశయంలో ఓ పిండం వృద్ధి చెందకుండా మరో పిండంలో అలాగే ఉండి చనిపోయిందని అన్నారు. దీనినే వైద్య భాషలో ఫీటస్ ఇన్ ఫీటు సమస్య అంటారని డాక్టర్లు తెలిపారు.
Related News
Aarti Chabria: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. నెల కిందటే అమ్మా అయ్యానంటూ!
బాలీవుడ్ ప్రముఖ నటి, హీరోయిన్ ఆర్తి చాబ్రియా గురించి మనందరికి తెలిసిందే. ఈమె తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే ఇటీవల ఆమె బేబీ బంప్ తో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆర్తి త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా తన ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పింది ఆర్తి. ఇప్పటికే తా�