‘Love Knows No Age’ : 110 ఏళ్ల వయసులో నాల్గో పెళ్లి చేసుకున్న వృద్ధుడు
110 ఏళ్ల వృద్ధుడు పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచారు. అది కూడా నాలుగోసారి పెళ్లి చేసుకోవడం విశేషం
- By Sudheer Published Date - 06:04 PM, Wed - 23 August 23

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మధురమైన ఘట్టం. ఈ ఘట్టాన్ని ఎంతో ప్రేమగా ఆస్వాదిస్తారు. ఎవరో తెలియని ఓ అమ్మాయి మన ఇంట్లో అడుగుపెడుతుంది. మనలో సగం అవుతుంది..మన వంశాన్ని నిలబెట్టే తల్లి అవుతుంది..ఆ తర్వాత పిల్లలను పెంచడం..కుటుంబాన్ని చూసుకోవడం..ఇలా అన్ని తానై ఉంటుంది. పెళ్లి అనే బంధం మన జీవితాన్నే మార్చేస్తుంది. అలాంటి పెళ్లి ఘట్టం..ఇప్పుడుబొమ్మలా పెళ్లిలా మారిపోయింది.
ప్రేమ పేరుతో దగ్గరవ్వడం..పెళ్లి చేసుకోవడం..కోర్కెలు తీర్చుకోవడం..ఆ తర్వాత విడిపోవడం చేస్తున్నారు. ఎంత స్పీడ్ గా ప్రేమలో పడుతున్నారో..అంతే స్పీడ్ గా వివాహం చేసుకొని , విడిపోతున్నారు. ప్రతి రోజు ఎన్నో జంటలు కోర్టుల ద్వారా విడాకులు తీసుకొని విడిపోతున్నారు. ఇలాంటి ఈ తరుణంలో 110 ఏళ్ల వృద్ధుడు పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచారు. అది కూడా నాలుగోసారి పెళ్లి చేసుకోవడం విశేషం. ఈ వృద్దుడ్ని పెళ్లి చేసుకున్న మహిళా వయసు 55 ఏళ్ళు.
ఈ ఘటన పాకిస్తాన్లోని (Pakistan ) కైబర్ పక్తున్వ లో జరిగిది. ఒంటరిగా ఫీలవుతున్నానని అబ్దుల్ హసన్ (Abdul Hannan ) అనే వృద్ధుడు 55 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడు. హాసన్ కుటుంబంలో ఇప్పటికే 84 మంది (84 family members) ఉండగా.. అతని పెద్ద కుమారుడి వయసు 70 ఏళ్ళు. అయితే ఈ కురువృద్ధుడికి ఏకంగా 5000 రూపాయల కట్నం ఇచ్చి పెళ్లి చేశారట. ఈ వార్త వెలుగులోకి వచ్చిన దగ్గరి నుండి అంత దీని గురించే మాట్లాడుకుంటున్నారు.