Viral Video: కదులుతున్న రైల్లో నుంచి యువకుడిని తోసేసిన వ్యక్తి.. వీడియో వైరల్?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోని చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా షాక్
- By Nakshatra Published Date - 05:32 PM, Tue - 18 October 22

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోని చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. కదులుతున్న రైలు నుంచి తోటి ప్రయాణికుని ఒక వ్యక్తి బయటకు తోసేసాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షాకింగ్ ఘటన తాజాగా పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సజల్ షేక్ అనే వ్యక్తి హావ్‌డా మాల్దా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో తాజాగా తన ఇంటికి వెళుతున్నాడు. అయితే ట్రైన్ లో దుర్భాషలాడుతున్నాడని, మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ సజల్ తో ఓ వ్యక్తి గొడవపడ్డాడు.
దాంతో సజల్ అతని పై చేయిచేసుకోగా వెంటనే అతను విచక్షణ కోల్పోయి ఆ వ్యక్తి యువకుడిని రైళ్లో నుంచి బయటకు తోసేశాడు. ఆపై తాపీగా, తనకేమీ తెలియనట్లుగా వెళ్లి సీట్లో కూర్చున్నాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగాపట్టాల పక్కన గాయాలతో నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితుడిని గుర్తించిన రైల్వే పోలీసులు అతడిని బిర్భూమ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం అతడి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
This is totally Shocking…
from #WestBengal
After an altercation a passenger pushed another out of a moving express train & coolly went back to his seat.#IndianRailwayspic.twitter.com/wO0JuBmddX
— मुंबई Matters™✳️ (@mumbaimatterz) October 17, 2022
అయితే ఆ బాధితుడు కోలుకున్న తరువాత నలుగురు సభ్యులు గల బృందం ఆకతాయి చేష్టలను నిలువరించేందుకు వెళితే ఇలా చేశారని ఆరోపించాడు. కొంతమంది గట్టిగట్టిగా మాట్లాడుతూ ఇతరులను అసౌకర్యానికి గురిచేస్తున్నారు. అలా ట్రైన్ లో నా పక్కనే కూర్చున్న ఓ కుటుంబం అసౌకర్యానికి గురైంది. ఈ విషయాన్ని వారికి చెప్పడానికి వెళ్ళాను. అప్పుడు అందులో ఒక వ్యక్తి వచ్చి నాతో గొడవకు దిగి నన్ను చంపేస్తానంటూ బెదిరించాడు. ఆపై ఏం జరిగిందో అర్థంకాలేదు. కళ్లు తెరిచి చూస్తే రైలు పట్టాలపై ఉన్నాను అని చెప్పుకొచ్చాడు సదరు బాధితుడు.
Related News

Viral Video: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న చాచాజీ లుంగీ డ్యాన్స్
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతీది వైరల్ అవుతుంది. మారుమూల ప్రాంతంలో జరిగిన చిన్న ఇన్సిడెంట్ కూడా క్షణాల్లో వైరల్ గా మారుతుంది.