Konda Visweswar Reddy : బీజేపీలోకి కొండా కన్‌ఫర్మ్? తనతో పాటు మరో 30మంది కీలక నేతలు?
గత కొంతకాలంగా రాజకీయ ఊగిసలాట అవలంభిస్తున్న చేవెళ్ల మాజీ ఎంపీ తెలంగాణ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజకీయ అడుగుల పై అందరికీ ఆసక్తి నెలకొంది.
- By Hashtag U Published Date - 05:13 PM, Thu - 12 May 22
గత కొంతకాలంగా రాజకీయ ఊగిసలాట అవలంభిస్తున్న చేవెళ్ల మాజీ ఎంపీ తెలంగాణ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజకీయ అడుగుల పై అందరికీ ఆసక్తి నెలకొంది.ఆర్థికంగా స్థిత మంతుడైన కొండా విశ్వేశ్వర్ రెడ్డి టిఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ గా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్ లో చేరారు .ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు.తర్వాత ఏ పార్టీలో చేరుతారనే ఉత్కంఠ కొనసాగుతూనే వస్తోంది. అయితే, ఆయన బీజేపీలోకి వెళ్లాలని డిసైడైనట్టు, తనతో పాటుమరో 30మంది కీలక నేతలను తీసుకువెళ్లనున్నట్టు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని కింద వీడియోలో చూడచ్చు..