YouTube Vs Ad Blockers : యూట్యూబ్ యూజర్లకు ఆ మెసేజ్.. ఏం చేయాలి ?
YouTube Vs Ad Blockers : మీరు ‘యాడ్ బ్లాకర్స్’ వాడుతున్నారా ? యూట్యూబ్ వీడియోలను చూస్తుండగా.. ‘యాడ్ బ్లాకర్స్ ఆర్ నాట్ అలోడ్ ఆన్ యూట్యూబ్’ అనే మెసేజ్ డిస్ ప్లే అయిందా ?
- Author : Pasha
Date : 17-10-2023 - 10:07 IST
Published By : Hashtagu Telugu Desk
YouTube Vs Ad Blockers : మీరు ‘యాడ్ బ్లాకర్స్’ వాడుతున్నారా ? యూట్యూబ్ వీడియోలను చూస్తుండగా.. ‘యాడ్ బ్లాకర్స్ ఆర్ నాట్ అలోడ్ ఆన్ యూట్యూబ్’ అనే మెసేజ్ డిస్ ప్లే అయిందా ? ఎన్నడూ లేనిది ఇప్పుడే ఈ మెసేజ్ యూట్యూబ్ లో ఎందుకు వచ్చింది అని గాబరా పడుతున్నారా ? మరేం లేదు.. యూట్యూబ్ ఈమేరకు తన ప్లాట్ ఫామ్ లో కొత్త అప్ డేట్ చేసింది. ఇందులో భాగంగా యాడ్ బ్లాకర్స్ ఉన్న ఫోన్లు, కంప్యూటర్లు, లాప్ ట్యాప్ లు, ట్యాబ్లలో యూట్యూబ్ వీడియోలు ప్లే కావు. ఆ యాడ్ బ్లాకర్ సెట్టింగ్ లోకి వెళ్లి యూట్యూబ్ లో యాడ్ బ్లాకింగ్ ను డిసేబుల్ చేస్తే తప్ప మీకు వీడియోలు ప్లే కావు. యూట్యూబ్ తనకు యాడ్స్ ఇచ్చే వారి ప్రయోజనాలను కాపాడేందుకు.. కంటెంట్ క్రియేటర్ల వీడియోల ద్వారా సర్క్యులేట్ చేసే యాడ్స్ రీచ్ ను పెంచేందుకు ఈ చర్యను చేపట్టింది. యూట్యూబ్ పంపుతున్న మెసేజ్ లో ఒక కీలకమైన సూచన కూడా ఉంది. ఒకవేళ యాడ్స్ లేకుండా వీడియోలను చూడాలని భావిస్తే.. యూట్యూబ్ ప్రీమియంను సబ్ స్క్రయిబ్ చేసుకోవాలని యూట్యూబ్ కోరింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ మెసేజ్ గురించి ట్విట్టర్ వేదికగా నెటిజన్స్ నడుమ చర్చ జరుగుతోంది. ఇక యాడ్ బ్లాకర్ ను డిసేబుల్ చేసి యూట్యూబ్ వీడియోలను యాడ్ తో పాటు చూడటం ఒక్కటే మనముందన్న మార్గం అని ఒకరికొకరు నెటిజన్స్ చెప్పుకున్నారు. ఆర్థిక స్థోమత కలిగిన వారు నెలకు రూ. 129 చొప్పున పేమెంట్ చేసి యూట్యూబ్ ప్రీమియంకు షిఫ్ట్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. గూగుల్ క్రోమ్, మైక్రో సాఫ్ట్ ఎడ్జ్ సహా అన్ని రకాల బ్రౌజర్లలో యాడ్ బ్లాకర్ ఎక్స్ టెన్షన్ లు అందుబాటులో ఉన్నాయి. యాడ్స్ చూసి సమయం వేస్ట్ చేసుకోకుండా ఉండేందుకు.. వీటిని నెటిజన్లు విరివిగా వినియోగిస్తున్నారు. కానీ నెటిజన్ల ఈ ఆలోచన యూట్యూబ్ ప్రకటనల వ్యాపారాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అందుకే తాజా చర్యలకు (YouTube Vs Ad Blockers) ఆ కంపెనీ ఉపక్రమించింది.