Muslims Should Give Solution : “జ్ఞానవాపి మసీదు ఒక చారిత్రక తప్పిదం.. దానికి ముస్లింలే పరిష్కారం చూపాలి”
Muslims Should Give Solution : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
- Author : Pasha
Date : 31-07-2023 - 4:14 IST
Published By : Hashtagu Telugu Desk
Muslims Should Give Solution : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ మసీదు విషయంలో జరిగిన చారిత్రక తప్పిదానికి పరిష్కారాన్ని చూపాల్సిన బాధ్యత ముస్లింలపై ఉందన్నారు. జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సర్వే చేయాలంటూ దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ అలహాబాద్ హైకోర్టులో మసీదు కమిటీ వేసిన అప్పీల్ పిటిషన్ పై విచారణ జరుగుతున్న తరుణంలో యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ అప్పీల్ పిటిషన్‌పై ఆగస్టు 3న తీర్పు వెలువడే అవకాశం ఉంది.
Also read : USA: కోట్ల ఫాలోవర్స్ ఉన్నా కూడా.. అడవిలో జీవిస్తున్న పాపులర్ టిక్ టాకర్..?
“జ్ఞానవాపిని మసీదు అని పిలిస్తే.. అది వివాదంగా మారుతుంది. భగవంతుడు చూపు ఇచ్చిన వాళ్ళు ఆ మసీదులో ఉన్న త్రిశూలాన్ని చూడాలి.. అది అక్కడ ఎందుకు ఉందో ఆలోచించాలి. అక్కడే జ్యోతిర్లింగం, దేవతా మూర్తులు కూడా ఉన్నాయి. జ్ఞానవాపి గోడలు అరుస్తూ ఏదేదో మాట్లాడుతున్నాయి. చారిత్రక తప్పిదం జరిగింది. దీనికి పరిష్కారం చూపేలా ముస్లిం సమాజం నుంచి ప్రతిపాదన రావాలని(Muslims Should Give Solution) నేను కోరుకుంటున్నాను” అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Also read : AP Volunteer : వైజాగ్ లో వృద్ధురాలి హత్య..వాలంటీర్స్ వండర్స్ అంటూ జనసేనాని ట్వీట్
సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. “జ్ఞానవాపి మసీదులో ఏఎస్‌ఐ సర్వేను వ్యతిరేకిస్తూ అలహాబాద్ హైకోర్టులో ముస్లిం పక్షం వేసిన పిటిషన్ పై త్వరలో తీర్పు వెలువడుతుంది. ఈవిషయం తెలిసినా సీఎం యోగి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్య చేయడం సరికాదు” అని అన్నారు.