AP Volunteer : వైజాగ్ లో వృద్ధురాలి హత్య..వాలంటీర్స్ వండర్స్ అంటూ జనసేనాని ట్వీట్
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మరో హత్య జరిగింది
- Author : Sudheer
Date : 31-07-2023 - 3:54 IST
Published By : Hashtagu Telugu Desk
విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ లో వరలక్ష్మి (72) అనే వృద్ధురాలి (Old Women)ని అతి దారుణంగా వెంకటేష్ (Volunteer Venkatesh) అనే వాలంటీర్ హత్య చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాష్ట్రంలో వాలంటీర్స్ లలో కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చెపుతూ వస్తున్నాడు. అయినప్పటికీ ప్రభుత్వం వారిని కట్టడి చేయడం మానేసి సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ఫై విరుచుకుపడుతున్నారు. కళ్లముందు ఎన్నో దారుణాలకు వాలంటీర్స్ ఒడిగట్టిన ..ప్రభుత్వం మాత్రం ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహరిస్తుందని ప్రతిపక్షపార్టీలు గగ్గోలు పెడుతున్నాయి.
ఇక ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మరో (Varalakshmi ) హత్య జరిగింది. ఈ హత్య పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ట్వీట్ చేసారు. వాలంటీర్స్ వండర్స్ – ఎపిసోడ్ ఇన్ఫినిటీ అంటూ, వాలంటీర్స్ చేసేవి అనంతమని తెలిపారు. పెందుర్తి లో 72 ఏళ్ల వృద్ధురాలిని బంగారం కొట్టేయడం కోసం హత్య చేసిన “వాలంటీర్ వెంకట్”, అంటూ వాలంటీర్లను పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. వైసీపీ పార్టీ నాయకుల స్ఫూర్తితో హత్య చేశాడా మీ సేవ రత్న.. వైయస్ జగన్ సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు. అంతే కాదు రీసెంట్ గా సీఎం జగన్ (CM Jagan) మాట్లాడిన వీడియో ను పోస్ట్ చేసాడు. మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇక వృద్ధురాలి హత్య విషయానికి వస్తే..వరలక్ష్మి వద్ద వెంకటేష్ గత కొద్దీ రోజులుగా పనిచేస్తూ నమ్మకంగా ఉన్నాడు. ఆమె దగ్గర భారీగా డబ్బు ఉన్నట్లు భావించిన వెంకటేష్..నిన్న రాత్రి పదిన్నర గంటల సమయంలో ఆమె ఇంటికి వెళ్లి ఆమె ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి ఆమెను హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని ఎత్తుకొని వెళ్లాడు. ప్రస్తుతం పోలీసులు వెంకటేష్ కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు.
వాలంటీర్స్ వండర్స్ – ఎపిసోడ్ ♾️
పెందుర్తి లో 72 ఏళ్ల వృద్ధురాలి ని బంగారం కొట్టేయడం కోసం హత్య చేసిన "వాలంటీర్ వెంకట్", @YSRCParty నాయకుల స్పూర్తితో హత్య చేశాడా మీ సేవారత్న @ysjagan ?#HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJSP pic.twitter.com/aVj7xAS2Gs
— JanaSena Shatagni (@JSPShatagniTeam) July 31, 2023
Read Also : TSRTC: మహిళలకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. లేడీస్ స్పెషల్ బస్సు ప్రారంభం!