Bhatti Vikramarka : 2025 మే నాటికి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పూర్తి : డిప్యూటీ సీఎం భట్టి
Bhatti Vikramarka : రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్తు డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని 2028-29 నాటికి 22,288 మెగావాట్లు అవకాశం ఉంటుందని అంచనా. 2034-35 నాటికి 31,809 విద్యుత్తు డిమాండ్ ను అంచనా వేసి ఉత్పత్తి చేయడానికి ప్రజా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్నది..అని అన్నారు.
- By Latha Suma Published Date - 04:42 PM, Sun - 3 November 24

Yadadri Thermal Power Station : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు యాదాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..2025 మే నాటికి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ను పూర్తి చేసి 4వేల మెగావాట్ల విద్యుత్తును గ్రిడ్డు కు అనుసంధానం చేస్తాం అన్నారు. ఈ మేరకు యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేషన్ లోని స్టేజి-1 లో అవుతున్న విద్యుత్ ఉత్పత్తిని గ్రిడ్డు కు అనుసంధానం చేసే కార్యక్రమం నేడు విజయవంతంగా జరిగింది.. అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్తు డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని 2028-29 నాటికి 22,288 మెగావాట్లు అవకాశం ఉంటుందని అంచనా. 2034-35 నాటికి 31,809 విద్యుత్తు డిమాండ్ ను అంచనా వేసి ఉత్పత్తి చేయడానికి ప్రజా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్నది..అని అన్నారు.
భవిష్యత్తులో విద్యుత్తు కు ఇబ్బంది రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. కాగా, రాష్ట్రంలో పరిశ్రమ, వ్యవసాయం, గృహ అవసరాలకు క్వాలిటీ పవర్ ను అందిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వాతావరణం కలుషితం కాకుండా 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నాం. రాష్ట్రంలో న్యూ ఎనర్జీ పాలసీని త్వరలోనే తీసుకువస్తాం. న్యూ ఎనర్జీ పాలసీని తీసుకురావడంలో మేధావులు విద్యుత్తు నిష్ణాతులతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకుంటాం. శాసనసభలో చర్చించి అందరి అభిప్రాయంతో న్యూ ఎనర్జీ పాలసీ తీసుకువస్తాం. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి వస్తున్న బహుళజాతి కంపెనీలు కొంత శాతం గ్రీన్ ఎనర్జీని వినియోగం చేస్తాయి. వారి అవసరాలకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసి ఇస్తాం. ఎనర్జీ విషయంలో దేశంలోనే తెలంగాణను తలమాణికంగా నిలుపుతాం అని డిప్యూటీ సీఎం భట్టి విమరించారు.