Ukraine: రష్యాకు సింహస్వప్నం.. ఈ ’గ్రేట్ స్నైపర్ వలి’
దాదాపు మూడు వారాలుగా ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్నా సరే.. రష్యాకు మాత్రం ఇంకా సంపూర్ణ విజయం దక్కలేదు. పేరుకు మిలటరీ యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పినా..
- By Hashtag U Published Date - 11:12 AM, Sun - 13 March 22
దాదాపు మూడు వారాలుగా ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్నా సరే.. రష్యాకు మాత్రం ఇంకా సంపూర్ణ విజయం దక్కలేదు. పేరుకు మిలటరీ యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పినా.. అది సమరమే అని ప్రపంచానికి బాగా తెలుసు. అందుకే ఉక్రెయిన్ కూడా విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. అందుకే ప్రపంచంలో యుద్ధరంగంలో ఆరితేరిన విదేశీయులు వచ్చిన హెల్ప్ చేయాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పిలుపునివ్వడమే ఆలస్యం.. వెంటనే అక్కడ వాలిపోయాడు.. గ్రేట్ స్నైపర్ వలి. గురిపెట్టడం.. కాల్చేయడం. వేటగాడి పని ఇంతే. ఒక్కోసారి అంచనా తప్పచ్చేమో.. కానీ బ్యాటిల్ గ్రౌండ్ లోకి దిగితే ఒక్క రౌండ్ కూడా వేస్ట్ చేయడీ బాహుబలి లాంటి స్నైపర్ వలి. అందుకే రష్యా సైనికులకు సింహస్వప్నంగా మారిపోయాడు. ఇప్పటికే ఆరుగురు రష్యా సైనికులకు చంపేశాడు. మనోడి ట్రాక్ రికార్డ్ ను చూస్తే.. వామ్మో! వీడు మామూలు స్నైపర్ కాదని మీరే అంటారు!
వలి.. ప్రపంచంలోనే ది బెస్ట్ స్నైపర్ లలో ఒకడు. పేరుకు యుద్ధ వీరుడే అయినా.. మనోడు ఫ్రెంచ్-కెనడియన్ కంప్యూటర్ సైంటిస్ట్. అందుకే అప్పట్లో రాయల్ కెనడియన్ రెజిమెంట్ లో పనిచేసిన అనుభవం కూడా ఉంది. వలి అంటే మన పౌరాణిక గ్రంథాల్లో పేరును పోలి ఉందే అనుకోకండి. వలి అనేది మనవాడి నిక్ నేమ్. కానీ అరబిక్ భాషలో ఈ పేరుకు అర్థమేంటా అని చూస్తే.. సంరక్షకుడు అని కనిపిస్తుంది. పేరుకు తగ్గట్టే నమ్ముకున్నవారికి రక్షణ కల్పిస్తాడు. ఆప్ఘన్ లో శత్రువులను చీల్చి చెండాడడంతో అక్కడి వారే వలీకి ఆ పేరు పెట్టారు. అయినా వలీ పోరాటం అక్కడితో ఆగలేదు. సిరియా, ఆప్ఘనిస్తాన్, ఇరాక్.. ఇలా మిగిలిన చోట్లా పోరాడాడు. ఇప్పుడు జెలెన్ స్కీ పిలిచాడు కదా అని తన భార్యతో పాటు నిండా ఏడాదైనా లేని కొడుకును కూడా వదిలేసి వచ్చేశాడు. గన్ తో పని మొదలుపెట్టేశాడు.
ఒక స్నైపర్ రోజుకు ఐదు నుంచి ఆరు టార్గెట్ లను మాత్రమే పూర్తిచేయగలడు. ఒకవేళ వాళ్లు మరీ టాలెంటెడ్ అనుకుంటే.. 7 నుంచి 10 మందిని చంపగలడు. కానీ మనోడు రోజుకు 40 మందినైనా చంపగలనని చెబుతున్నాడు. వలి షూటింగ్ రేంజ్ ఎలా ఉంటుందంటే.. 2017లో తనకు 3, 540 మీటర్ల దూరంలో ఉన్న ఒక టెర్రరిస్ట్ జిహాదీని కాల్చిపారేశాడు. అసలు ఇంత దూరంలో ఉన్నవారిని కాల్చి చంపడం అంటే మాటలు కాదు. అందుకే అతడిదే బెస్ట్ రికార్డ్ గా ఉంది. ఉక్రెయిన్ కానీ యుద్ధంలో విజయం సాధిస్తే.. వలి మరింత ఫేమస్ కావడం ఖాయం.
Related News
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో హ్యారీ పోటర్ కోట ధ్వంసం
హ్యారీ పోటర్ సిరీస్ లో ఓ భారీ కోట అందరికి తెలిసే ఉంటుంది. ఆ భవనం ఉక్రెయిన్లోని ఒడెస్సా నగరంలో ఉంది. ఇప్పుడు ఇది రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా నాశనం అయింది. ఈ విద్యా సంస్థ భవనంపై రష్యన్ క్షిపణి దాడి చేసింది.