HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >World Happiness Report India Among Unhappiest Nations Languishes At 136th Spot

World Happiness Report:భారత్ లో ఎవరూ సంతోషంగా లేరా ? మనకంటే పాక్ ముందుంది..!!

ప్రపంచంలో అత్యంత సంతోషకరంగా ఏయో దేశాలు ఉన్నాయో తెలిపే జాబితా తాజాగా రిలీజ్ అయ్యింది.

  • By Hashtag U Published Date - 02:21 PM, Sun - 20 March 22
  • daily-hunt
Happiness Index
Happiness Index

ప్రపంచంలో అత్యంత సంతోషకరంగా ఏయో దేశాలు ఉన్నాయో తెలిపే జాబితా తాజాగా రిలీజ్ అయ్యింది. ప్రపంచంలోనే సంతోషకరంగా దేశంగా ఫిన్లాండ్ ముందు వరుసలో నిలిచింది. ఫిన్లాండ్ ఈ ఘనత సాధించడం వరుసగా ఇది ఐదోసారి అట. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 146దేశాల్లో జరిపిన అధ్యయనం ఆధారంగా ఈ రిపోర్టును బయటపెట్టారు.

ఇక ఈ రిపోర్టు ప్రకారంగా చూసినట్లయితే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్ మొదటిస్థానంలో నిలుస్తే…అప్ఘానిస్తాన్ చివరి స్థానంలో నిలిచింది. టాప్ 20దేశాల జాబితా, గతేడాదికి ఇప్పటికీ స్థానంలో ఎలాంటి తేడాలు ఉన్నాయో చూద్దాం.

ఫిన్లాండ్ (=)
డెన్మార్క్ (=)
ఐస్లాండ్ (+1)
స్విట్జర్లాండ్ (-1)
నెదర్లాండ్స్ (=)
లక్సమ్‌బర్గ్ (+2)
స్వీడన్ (=)
నార్వే (-2)
ఇజ్రాయెల్ (+3)
న్యూజిలాండ్ (-1)
ఆస్ట్రియా (-1)
ఆస్ట్రేలియా (-1)
ఐర్లాండ్ (+2)
జర్మనీ (-1)
కెనడా (-1)
అమెరికా (+3)
యునైటెడ్ కింగ్‌డమ్ (=)
చెక్ రిపబ్లిక్ (=)
బెల్జియం (+1)
ఫ్రాన్స్….కొత్తగా పోటీలోకి వచ్చింది..

మరి ఈ జాబితాలో భారత్ ఎక్కడుంది…?

అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో భారత్ 136 వ స్థానంలో నిలిచింది. గతేడాది 139వ స్థానంలో ఉంది భారత్. అంటే మూడు స్థానాలు మెరుగైందని చెప్పవచ్చు. అయితే పాకిస్థాన్ 121, నేపాల్ 84, బంగ్లాదేశ్ 94, శ్రీలంక 127 దేశాలు మనకంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి.
అయితే ఈ రిపోర్టు ఉక్రెయిన్ పై రష్యా దాడికి ముందు రూపొందించబడింది. దీంతో రష్యా 80వస్థానంలో నిలవగా…ఉక్రెయిన్ 98వ స్థానంలో నిలిచింది.

ఈ జాబితాను ఎలా రూపొందిస్తారంటే…పౌరుల సంతోషం, ఆదాయం, ఆరోగ్యం, సామాజిక అంశాల వంటి వాటిని పరిశీలిస్తారు. 0-10పాయింట్స్ ఆధారంగా ఈ రిపోర్టును రూపొందిస్తారు. అఫ్ఘానిస్తాన్ చివరి స్థానంలో నిలిచింది. లెబనాన్ 145, జింబాబ్వే 144, రువాండ 143 ర్యాంకులు సాధించాయి.

ఈ రిపోర్టు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు ఉన్న చిన్నారులు దాదాపు 10లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారని తేలింది. చిన్నారులకు సాయం అందకుంటే వాళ్లంతా మరణించే అవకాశం ఉందని ఈ రిపోర్టు ద్వారా వెల్లడైంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • happiness index
  • india
  • pakistan

Related News

H1B Visa

H1B Visa: హెచ్‌-1బీ వీసా దుర్వినియోగంపై ట్రంప్ సర్కార్ ప్రకటన!

డిపార్ట్‌మెంట్ తన అధికారిక 'X' (గతంలో ట్విట్టర్) హ్యాండిల్‌లో ఈ ప్రకటనను పోస్ట్ చేసింది. దానికిచ్చిన శీర్షిక (Caption)లో "H-1B వీసా భారీ దుర్వినియోగం కారణంగా అమెరికా యువత కలలు కరిగిపోయాయి.

  • India vs Pakistan

    India vs Pakistan: ఆసియా కప్ విజయం తర్వాత మళ్లీ భారత్- పాకిస్తాన్ మ్యాచ్!

  • Australia Beat India

    Australia Beat India: ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర ఓట‌మి!

  • Jemimah Rodrigues

    Jemimah Rodrigues: భార‌త్‌ను ఫైన‌ల్స్‌కు చేర్చిన జెమీమా రోడ్రిగ్స్!

  • President Murmu

    President Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఉన్న ఈ మ‌హిళ ఎవ‌రో తెలుసా?

Latest News

  • Allu Sirish: ఘనంగా అల్లు శిరీష్-నయనిక నిశ్చితార్థం.. మెగా ఫ్యామిలీ సందడి!

  • Men Get Romantic: రాత్రి 12 దాటితే మగవారి మనసు ఎందుకు మారుతుంది?

  • IND vs AUS: మెల్‌బోర్న్‌లో భారత్‌ ఘోర పరాజయం.. కార‌ణాలివే?

  • Chandrababu London Tour : రేపు యూకే కు ముఖ్యమంత్రి చంద్రబాబు

  • Bike Start Tips: చలికాలంలో బైక్ స్టార్ట్ కావడం లేదా? ఈ ట్రిక్స్‌తో సమస్యకు చెక్!

Trending News

    • 5 Star Hotel: ఇక‌పై టాయిలెట్ వ‌స్తే.. 5 స్టార్ హోట‌ల్‌కు అయినా వెళ్లొచ్చు!

    • Bank Holidays: బ్యాంకు వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. మొత్తం 10 రోజుల సెల‌వులు!

    • Rohit Sharma: రోహిత్ శర్మ కేకేఆర్‌కు వెళ్ల‌నున్నాడా? అస‌లు నిజం ఇదే!

    • Gold Bond : గోల్డ్ బ్యాండ్ ధ‌ర‌కు రెక్క‌లు..ఇప్పుడు 3వేలు..ఇప్పుడెంతో నాల్గురెట్లు.!

    • Traffic Challan Cancellation: మీరు ఏదైనా వాహ‌నం న‌డుపుతున్నారా? అయితే ఈ ట్రాఫిక్ రూల్ తెలుసుకోవాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd