Naked Man Festival : 10వేల మంది నగ్న పురుషుల పోటీ.. 40 మంది మహిళలకు ఎంట్రీ !
Naked Man Festival : జపాన్‌లోని ప్రధాన మతాల్లో షింటోయిజం ఒకటి. ఈ మతం వాళ్లు ప్రకృతిని ఆరాధిస్తుంటారు.
- By Pasha Published Date - 12:23 PM, Wed - 24 January 24

Naked Man Festival : జపాన్‌లోని ప్రధాన మతాల్లో షింటోయిజం ఒకటి. ఈ మతం వాళ్లు ప్రకృతిని ఆరాధిస్తుంటారు. వీళ్లు విచిత్రమైన వేడుకలను జరుపుకుంటుంటారు. ఈ మతానికి చెందిన ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పేరు కొనోమియా. ఇది జపాన్‌లోని ఐచి ప్రిఫెక్చర్ ప్రాంతంలో ఉన్న ఇనాజావా పట్టణంలో ఉంది. ఈ పుణ్యక్షేత్రం ఆధ్వర్యంలో ఏటా ‘హడకా మత్సూరి’ అనే వేడుకను నిర్వహిస్తుంటారు. దీన్నే ఇంగ్లిష్‌లో ‘నేక్డ్ మ్యాన్’ ఫెస్టివల్ అని పిలుస్తారు. పేరులో ఉన్నట్టుగా ఇందులో పురుషులంతా నగ్నం(నేక్డ్)గా పాల్గొంటారు. దాదాపు 1650 ఏళ్ల నుంచి ఈ ఉత్సవం జపాన్‌లో జరుగుతోందని చెబుతుంటారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 22న జరగనున్న ‘నేక్డ్ మ్యాన్’ ఫెస్టివల్ చాలా స్పెషల్‌గా జరగనుంది. ఈసారి ఒక కొత్త మార్పును అందరూ చూడబోతున్నారు. అదేమిటంటే.. ఈ దఫా ‘నేక్డ్ మ్యాన్’ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి తొలిసారిగా 40 మంది మహిళలను షింటో మతపెద్దలు అనుమతించారు. దాదాపు 10వేల మంది పురుషులు నగ్న స్థితిలో పాల్గొనే ఈ వేడుకలో 40 మంది మహిళలు ఏం చేస్తారని ఆలోచిస్తున్నారా ? ఈ నలభై మంది మహిళలు పూర్తిగా దుస్తులు ధరించి ఉంటారు. సంప్రదాయ హ్యాపీ కోట్‌లలో వారు పుణ్యక్షేత్రానికి వస్తారు. వెదురు గడ్డిని గుడ్డలో చుట్టి పుణ్యక్షేత్రంలోకి తీసుకెళ్లాల్సిన నాయిజాస అనే ఆచారంలో ఈ మహిళలు పాల్గొంటారని పుణ్యక్షేత్ర వర్గాలు తెలిపాయి.
We’re now on WhatsApp. Click to Join.
కొనోమియా పుణ్యక్షేత్రం ‘హడకా మత్సూరి’ వేడుక నిర్వాహక కమిటీ అధికారి మిత్సుగు కటయమా మాట్లాడుతూ.. ‘‘కరోనా మహమ్మారి కారణంగా మేం గత మూడు సంవత్సరాలుగా పండుగను నిర్వహించలేకపోయాం. ఈ వేడుకల్లో పాల్గొంటామంటూ మాకు మహిళల నుంచి పెద్దఎత్తున అభ్యర్థనలు వచ్చాయి. అందువల్లే వారికి ఈసారి ఫెస్టివల్‌లో పాల్గొనే ఛాన్స్ ఇచ్చాం’’ అని వెల్లడించారు. ‘‘గతంలో కూడా మహిళలు ఈ వేడుకల్లో పాల్గొనడంపై బ్యాన్ ఉండేది. అయితే మహిళలే స్వచ్ఛందంగా ఈ వేడుకకు దూరంగా ఉండేవారు. ఈసారి మహిళలు ఫెస్టివల్‌లో పాల్గొనేలా మేం చేసిన ప్రకటనపై మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి’’ అని ఆయన చెప్పారు.
Also Read : New Ration Cards : కొత్త రేషన్ కార్డులకు ‘మీసేవ’లో అప్లికేషన్లు.. ఎప్పటి నుంచి అంటే..
‘హడకా మత్సూరి’ వేడుకలో(Naked Man Festival) భాగంగా ఆలయ పూజారి చిన్నపాటి 100 కర్ర దుంగలను ఆలయ ప్రాంగణంలో విసిరేస్తారు. వాటిలో నుంచి రెండు లక్కీ స్టిక్స్‌ను వెతికివెతికి తీసుకోవడానికి 10వేల మంది నగ్న పురుషులు పోటీపడతారు. ఒకరినొకరు తోసుకుంటూ ఆలయ ప్రాంగణంలో పరుగులు తీస్తారు. వీటిలో లక్కీ స్టిక్‌ను గుర్తించి తీసుకునే వ్యక్తిని ‘షిన్-ఓటోకో’ అని పిలుస్తారు. ఈ లక్కీ స్టిక్‌ను పట్టుకున్న వారిని ఈ ఏడాదిలో లక్ వరిస్తుందని నమ్ముతారు. ఈ ఈవెంట్‌లో పాల్గొనడానికి ముందు పురుషులంతా నగ్నంగా మారి.. గడ్డకట్టే చల్లటి నీటిలో స్నానం చేస్తారు. ఈ పోటీలో తీవ్ర తొక్కిసలాట కారణంగా ఎంతోమందికి గాయాలు అవుతుంటాయి.