Women and Alcohol: మందేస్తున్న మహిళలు.. సర్వేలో సంచలన విషయాలు!
కోవిడ్ తో ప్రపంచ దేశాలన్నీ తీవ్ర సంక్షోభం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే కోవిడ్ కేసులు, మరణాలు తగ్గినా ప్రభావం కూడా ఇప్పటికే
- By Balu J Published Date - 12:03 PM, Wed - 9 November 22

కోవిడ్ తో ప్రపంచ దేశాలన్నీ తీవ్ర సంక్షోభం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే కోవిడ్ కేసులు, మరణాలు తగ్గినా ప్రభావం కూడా ఇప్పటికే చూపుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. శ్వాస సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న బాధపడుతున్నట్టు పలు సర్వేల్లో తేలింది. కోవిడ్ తర్వాత మహిళలు ఎక్కువగా మద్యం తీసుకుంటున్నారని తాజా సర్వేలో తెలిపింది.
మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి మహిళలు ఒత్తిడి, ఇతర కారణాల వల్ల ఎక్కువగా మద్యం తీసుకుంటారు. మరికొంత మంది మహిళలు క్యాజువల్‌గా మద్యం కూడా తీసుకుంటున్నారు. ఇంకొంతమంది పార్టీలు పేరుతో కూడా మద్యానికి అలవాటైనట్టు తేలింది. కమ్యూనిటీ ఎగైనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్ (CADD) పేరుతో ఒక NGO దేశ రాజధాని ఢిల్లీలో మహిళల్లో మద్యపాన అలవాట్లపై ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 5,000 మందికి పైగా మహిళలు కీలక విషయాలను వెల్లడించారు.
37 శాతం మంది మహిళలు గత మూడేళ్లలో ఆల్కహాల్ వినియోగం పెరిగిందని చెప్పగా, 45 శాతం మంది ఒత్తిడి కారణంగా ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటున్నారని చెప్పారు. కోవిడ్ ప్రభావంతో 2020 లో చాలా వరకు మద్యం దుకాణాలు, బార్లు మూతపడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కోల్పోయిన ఫన్ ను తిరిగి ఎంజాయ్ చేసేందుకు కూడా మద్యం తీసుకున్నట్లు కూడా బహిర్గతమైంది. అయితే ఒత్తిడి, ఇతర కారణాల వల్ల కూడా మద్యం తాగుతున్నట్టు ఎక్కువ మంది మహిళలు తెలిపారు.