Lion Walk: సింహాలతో మార్నింగ్ వాక్.. వీడియో వైరల్
ఎవరైనా పార్క్‌లో జాగింగ్ చేస్తారు. కానీ ఆమె మాత్రం ఏకంగా సింహాల గుంపుతోనే వాకింగ్‌కు వెళ్లింది.
- By Hashtag U Published Date - 05:17 PM, Thu - 13 January 22

ఎవరైనా పార్క్‌లో జాగింగ్ చేస్తారు. కానీ ఆమె మాత్రం ఏకంగా సింహాల గుంపుతోనే వాకింగ్‌కు వెళ్లింది. అవును ఇది నిజం. మోగ్లీ స్టోరీ కాదు.. అడవిలో నివసించే వాళ్ల వీడియోనూ కాదు. నిమ్మకంగా లేదా అయితే ఈ వీడియో చూసేయండి.
సఫారీ గ్యాలరీ అనే ఇన్‌స్టా ప్రొఫైల్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. చుట్టుపక్కల పరిసరాలు చూస్తుంటే ఆఫ్రికా అని అర్ధమవుతోంది. సింహాలు ముందు గుంపుగా వెళుతుంటే దాని వెనుక ఓ అమ్మాయి డ్యాన్స్ చేస్తూ ఎలాంటి భయం లేకుండా నడుచుకుంటూ వెళ్తోంది. అంతేకాదు.. ఓ సింహం తోక పట్టి పరాచకాలాడింది.