Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Trending News
  • ⁄Where Does Russia Stand After Fall Of Ukrainian Citys Last Bridge Leaves No Escape Route For Residents

Ukraine : వంతెన కూలడంతో.. ఎరక్కపోయి ఇరుక్కుపోయిన ఉక్రెయిన్ సైనికులు!!

"ఎరక్కపోయి.. ఇరుక్కుపోయారు" అన్నట్టుగా తయారైంది ఉక్రెయిన్ లోని సేవేరొ డోనేట్స్ నగరవాసుల పరిస్థితి.

  • By Hashtag U Published Date - 02:00 PM, Wed - 15 June 22
Ukraine : వంతెన కూలడంతో.. ఎరక్కపోయి ఇరుక్కుపోయిన ఉక్రెయిన్ సైనికులు!!

“ఎరక్కపోయి.. ఇరుక్కుపోయారు” అన్నట్టుగా తయారైంది ఉక్రెయిన్ లోని సేవేరొ డోనేట్స్ నగరవాసుల పరిస్థితి. ఈ నగరంలో ఉన్న వందలాది మంది ఉక్రెయిన్ సైనికులు, దానికి మద్దతు తెలిపే ఉద్యమకారులు పెను సవాల్ ను ఎదుర్కొంటున్నారు. ఆ సవాల్ ఏమిటంటే.. సేవేరొ డోనేట్స్ నగరాన్ని ఉక్రెయిన్ లోని ఇతర నగరాలతో అనుసంధానించే రెండు వంతెనలు కూడా కూలిపోయాయి. కాదు.. కాదు.. కూల్చేశారు!! ఇది రష్యా సైన్యం పనా ? ఉక్రెయిన్ సైన్యం పనా ? అనేది తెలియాల్సి ఉంది. రష్యా సైన్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు గతంలో చాలా చోట్ల వంతెనలను ఉక్రెయిన్ సైన్యం కూల్చేసింది. ఈక్రమంలోనే ఈ వంతెనను కూడా ఆ దేశ ఆర్మీ కూల్చేసిందా ? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. తదుపరి పరిణామాల గురించి ఆలోచించకుండా తొందరపాటుతో ఇలా చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఉక్రెయిన్ సైన్యం ముందు రెండే ఆప్షన్లు..

ఏది ఏమైనప్పటికి చివరి వంతెన కూడా కూలిపోవడంతో సేవేరొ డోనేట్స్ నగరంలో ఉన్న ఉక్రెయిన్ సైన్యం ముందు రెండే ఆప్షన్లు మిగిలాయి. ఒకటి.. ప్రాణాలకు తెగించి రష్యా సైన్యంతో పోరాడటం!! మరొకటి.. చేతులు పైకెత్తి లొంగిపోవడం!! సేవేరొ డోనేట్స్ ప్రాంతంలో రష్యా సైన్యం పెద్ద సంఖ్యలో ఉంది. రష్యా సానుభూతిపరులైన మిలిటెంట్ గ్రూపులు కూడా చాలానే ఉన్నాయి. ఈనేపథ్యంలో పరిమిత సంఖ్యలో అక్కడ చిక్కుకుపోయిన ఉక్రెయిన్ సైనికులు, మద్దతుదారులు పోరుబాట పట్టినా సాధించగలిగేది ఏమీ ఉండదు. తమ అధ్యక్షుడు పుతిన్ స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించిన “లుహన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్” పరిధిలోని సేవేరొ డోనేట్స్ ప్రాంత ప్రజలపై ఈగ కూడా వాలనివ్వమని.. వారిని భద్రంగా చూసుకుంటామని రష్యా సైన్యం ప్రకటనలు విడుదల చేసింది. సేవేరొ డోనేట్స్ నగరాన్ని స్థావరంగా మార్చుకొని సమీపంలోని జంట నగరం ” లిసి ఛాన్స్క్” ను ముట్టడించేందుకు రష్యా స్కెచ్ వేసే అవకాశం ఉంది.

Tags  

  • russia soldiers
  • Russia Ukraine Crisis
  • ukraine soldiers

Related News

Russia War : ఉక్రెయిన్ జర్నలిస్ట్ ను సజీవదహనం చేసిన రష్యా ఆర్మీ

Russia War : ఉక్రెయిన్ జర్నలిస్ట్ ను సజీవదహనం చేసిన రష్యా ఆర్మీ

రష్యా దళాలు ఉక్రెయిన్ లో మ్యాక్స్ లెవిన్ అనే ఫోటో జర్నలిస్ట్ ను సజీవ దహనం చేసిన ఘటన మూడు నెలలు ఆలస్యంగా వెలుగు చూసింది

  • Russia Ukraine War : 100 రోజుల ర‌ష్యా ఉక్రెయిన్ యుద్ధం.. 243 మంది చిన్నారుల యాదిలో..

    Russia Ukraine War : 100 రోజుల ర‌ష్యా ఉక్రెయిన్ యుద్ధం.. 243 మంది చిన్నారుల యాదిలో..

  • Russia Ukraine : న‌ల్ల సముద్రంలో ర‌ష్యాపై ఉక్రెయిన్ ఆధిప‌త్యం

    Russia Ukraine : న‌ల్ల సముద్రంలో ర‌ష్యాపై ఉక్రెయిన్ ఆధిప‌త్యం

  • Russia Ukraine Crisis : ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో మోడీ

    Russia Ukraine Crisis : ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో మోడీ

  • Ukraine war: 900 మందిని సామూహిక సమాధి చేసిన రష్యా సైన్యం

    Ukraine war: 900 మందిని సామూహిక సమాధి చేసిన రష్యా సైన్యం

Latest News

  • Introducing Venu Thottempudi: పవర్ ఫుల్ పాత్రతో వేణు తొట్టెంపూడి రీఎంట్రీ!

  • Oil rates: వారంలో తగ్గనున్న వంటనూనె ధర…!!

  • Oldest Air Hostess: 65 ఏళ్లుగా ఒకే రూట్ లో పని చేస్తున్న ఎయిర్ హాస్టస్.. ఆమె వివరాలివే!

  • Life Expectancy Report : ఎక్కువ కాలం జీవించేది ఎవరు…భారతీయులా..? చైనీయులా?

  • Militants Surrender : కరుడుగట్టిన ఉగ్రవాదుల మనస్సు మార్చిన తల్లిప్రేమ..!!

Trending

    • Zomato Bill: ఫుడ్ డెలివరీ మోసం.. వామ్మో ఒకేసారి ఇంత దోచేస్తున్నారా?

    • OTP విషయంలో గొడవ.. ప్యాసింజర్‌ను చంపిన ట్యాక్సీ డ్రైవర్!

    • Swiggy: డెలివరీ బాయ్ కోసం స్విగ్గీ స్వారీ!

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: