HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >What Is Irctc Ipay Autopay Here Is Everything You Need To Know

IRCTC iPay Autopay : డబ్బులు కట్ కాకుండానే టికెట్.. ఐఆర్‌సీటీసీ ‘ఐపే ఆటోపే’ ఫీచర్

IRCTC iPay Autopay :  రైలు ప్రయాణికుల సౌకర్యార్ధం ఐఆర్‌సీటీసీ (ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌) ‘ఐపే ఆటోపే’ అనే కొత్త  ఫీచర్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  

  • By Pasha Published Date - 01:21 PM, Tue - 20 February 24
  • daily-hunt
Irctc Ipay Autopay
Irctc Ipay Autopay

IRCTC iPay Autopay :  రైలు ప్రయాణికుల సౌకర్యార్ధం ఐఆర్‌సీటీసీ (ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌) ‘ఐపే ఆటోపే’ అనే కొత్త  ఫీచర్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  దీని ద్వారా మనం ఛార్జీని చెల్లించకుండానే ట్రైన్ టికెట్‌ను బుక్​ చేసుకోవచ్చు. టికెట్ బుకింగ్  కన్ఫామ్​ అయిన తర్వాతే పేమెంట్ చేయొచ్చు. దీనివల్ల ట్రైన్ టికెట్​ బుక్​ కాని పరిస్థితుల్లో మనం డబ్బులు కోల్పోయే ఛాన్స్ ఉండనే ఉండదు. రీఫండ్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంతకీ ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join

ఐఆర్​సీటీసీ వెబ్​సైట్​, యాప్​‌‌లలో..

‘ఐపే ఆటోపే’ అనేది ఐఆర్‌సీటీసీ సొంత పేమెంట్​ గేట్​వే. ఇది ఐఆర్​సీటీసీ వెబ్​సైట్​, యాప్​లో అందుబాటులో ఉంటుంది.ఐపే పేమెంట్ గేట్​వేకు ఉన్న ప్రత్యేక ఫీచర్ ‘ఆటోపే’. ‘ఆటో పే’ ఫీచర్‌లో(IRCTC iPay Autopay) యూపీఐ, డెబిట్/ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసే వెసులుబాటు ఉంటుంది. దీని ద్వారా ఎక్కువ విలువ కలిగిన లేదా వెయిట్ లిస్ట్​లో ఉన్న ట్రైన్ టికెట్​లను ఈజీగా, మనీ రిస్క్ లేకుండా బుక్​ చేయొచ్చు.  ఈ పద్ధతి ద్వారా ఒకవేళ మనం ట్రైన్ టికెట్ బుక్ చేసినా బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు బదిలీ కావు. మన బ్యాంక్ ఖాతాలో ఉన్న టికెట్​ ఛార్జీ మొత్తంపై లైయెన్ విధిస్తారు. లైయెన్ అంటే బ్యాంక్ అకౌంట్​లోని డబ్బు వేరే చోట ఖర్చు చేయకుండా నియంత్రణ విధించడం. మన టికెట్ కన్ఫామ్​ కాకపోయినా, క్యాన్సిల్ అయినా డబ్బులపై ఉన్న నియంత్రణ తొలగిపోతుంది.

Also Read : Nikki Haley – Kamala Harris : నేను లేదా కమల.. అమెరికా అధ్యక్ష పీఠంపై మహిళ : నిక్కీ

‘ఆటోపే’ చేయడం ఇలా..  

  • ఆటోపే ఫీచర్‌ను వాడుకునేందుకు మీరు తొలుత ఐఆర్​సీటీసీ వెబ్​సైట్​లోకి లాగిన్​ కండి.
  • మీ ప్రయాణ వివరాలను సరిగ్గా ఎంటర్ చేయండి.
  • మీ రైలు, కోచ్​, ప్రయాణికుల వివరాలను పొందుపర్చండి.
  • పేమెంట్ బటన్​పై క్లిక్​ చేసి iPayను పేమెంట్ గేట్​వేలా సెలెక్ట్ చేసుకోండి.
  • Autopay, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఐఆర్​సీటీసీ ముద్ర, నెట్​బ్యాంకింగ్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
  • Autopay ఆప్షన్​తో పాటు మీకు కావాల్సిన పేమెంట్ విధానం ఎంపిక చేయండి. అక్కడ మీకు  యూపీఐ, డెబిట్/ క్రెడిట్ కార్డ్ ఆప్షన్లు కనిపిస్తాయి.
  • పేమెంట్ వివరాలను నమోదు చేస్తే మీ లావాదేవీ కంప్లీట్ అవుతుంది.
  • వెంటనే మీ బ్యాంకు, టికెట్ డబ్బులపై నియంత్రణ విధిస్తుంది.
  • టికెట్ బుక్​ అయిన తర్వాతే మీ బ్యాంకు అకౌంట్ నుంచి  డబ్బులు కట్ అవుతాయి.

Also Read : Election Schedule 2024 : మార్చి 9 తర్వాత లోక్​సభ ఎన్నికల షెడ్యూల్.. డేట్స్ ఫిక్స్ !

  • ఒకవేళ వెయిట్​లిస్ట్​లో ఉన్న టికెట్‌ను బుక్ చేసిన సందర్భాల్లో అది కన్ఫామ్ కాకపోతే మీ డబ్బులు కట్ కావు. ఆటోపే నియంత్రణ తొలగిపోవడం వల్ల మీరు మీ డబ్బులను ఇతర అవసరాలకు వాడుకోవచ్చు.
  • తత్కాల్ కోటాలో వెయిల్​లిస్ట్​లో ఉన్న టికెట్​ బుక్​ చేసినప్పుడు, ఒకవేళ అది కన్ఫామ్ కాకపోతే, మీరు కేవలం క్యాన్సలేషన్ ఫీజు, ఐఆర్​సీటీసీ కన్వీనియెన్స్ ఫీజు, మాండేట్ ఛార్జీలు కడితే చాలు. మిగతా డబ్బు మీ ఖాతాలోకి తిరిగి వచ్చేస్తుంది.
  • ఇక వెయిట్​లిస్ట్​లో ఉన్న ట్రైన్ టికెట్‌ను బుక్ చేస్తే.. అది కన్ఫామ్ కానప్పుడు మన డబ్బులు వెంటనే రీఫండ్ అవుతాయి. కాకపోతే కనీసం 4 రోజులు వెయిట్ చేయాలి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IRCTC
  • IRCTC iPay Autopay
  • IRCTC Train Tickets
  • what is

Related News

    Latest News

    • Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు..!

    • IND vs AUS: నిరాశ‌ప‌ర్చిన రోహిత్‌, కోహ్లీ.. మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం!

    • Chinese Physicist Chen-Ning Yang: నోబెల్ అవార్డు గ్రహీత కన్నుమూత!

    • Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఇట‌లీలో చిక్కుకున్న ప్ర‌యాణీకులు!

    • No Kings Protests: ట్రంప్‌కు బిగ్ షాక్‌.. రోడ్డెక్కిన వేలాది మంది ప్ర‌జ‌లు!

    Trending News

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd