PM Modi : మరో ఐదేళ్లలో ముఖ్యమైన మైలురాళ్లను దాటబోతున్నాం : ప్రధాని
సౌర ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండింతలు చేసి.. మూడో అతిపెద్ద సౌరశక్తిని ఉత్పత్తి చేసే దేశంగా నిలిచాం..అన్నారు.
- By Latha Suma Published Date - 02:03 PM, Tue - 11 February 25

PM Modi : ప్రధాని మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన భారత ఇంధన వార్షికోత్సవాలు 2025 ను వర్చువల్‌గా ప్రారంభించి మాట్లాడారు. భారత్ తన సొంత వృద్ధినే కాకుండా.. ప్రపంచ వృద్ధి రేటును నడిపిస్తోంది. మన ఇంధన రంగం కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. వనరులు, మేధోసంపత్తి, ఆర్థిక బలం, రాజకీయ స్థిరత్వం, ప్రపంచ సుస్థిరతపై భారత్‌కు నిబద్ధత ఉన్నాయి. సౌర ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండింతలు చేసి.. మూడో అతిపెద్ద సౌరశక్తిని ఉత్పత్తి చేసే దేశంగా నిలిచాం..అన్నారు.
Read Also:EAGLE : విద్యాసంస్థల్లో ఈగల్ ఏర్పాటు.. మాదకద్రవ్యాలపై వ్యతిరేక పోరు
21వ శతాబ్దం భారత్‌దేనని ప్రపంచంలోని నిపుణులు చెబుతున్నారు. 2030 నాటికి నికర జీరో కర్బన ఉద్గార లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. మన శిలాజేతర ఇంధన శక్తి మూడు రెట్లు పెరిగింది. పారిస్ జీ20 ఒప్పంద లక్ష్యాలను చేరుకున్న మొదటి దేశం భారత్. రానున్న రెండు దశాబ్దాలు భారతదేశానికి అత్యంత కీలకం. మరో ఐదేళ్లలో ముఖ్యమైన మైలురాళ్లను దాటబోతున్నాం. ఇక, ఏటా 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని ప్రధాని మోడీ తెలిపారు.
మరోవైపు ప్రధని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యాక్షన్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. భారత్, ఐరోపా దేశాల అభివృద్ధితో పాటు మెరుగైన జీవన విధానం కోసం ‘ఏఐ’ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో మేక్రాన్ స్పష్టం చేశారు. కాగా, ప్రధాని మోడీ ఫ్రాన్స్‌లో పర్యటించడం ఇది ఆరోసారి. అనంతరం 12వ తేదీ సాయంత్రానికి అమెరికాకు చేరుకోనున్నారు. ఈసందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోడీ భేటీ అవుతారు.