Upset Husband: ఇదేందయ్యా.. భార్య కొడుతోందని చెట్టెక్కిన భర్త.. నెల నుంచి అక్కడే?
సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఆ గొడవలు కాస్త చిలికి చిలికి గాలి వానగా
- By Anshu Published Date - 05:05 PM, Sat - 27 August 22

సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఆ గొడవలు కాస్త చిలికి చిలికి గాలి వానగా మారుతూ ఉంటాయి. కొన్ని గొడవలు అయితే ఒకరిని ఒకరు చంపుకోవడం వరకు కూడా వెళుతూ ఉంటాయి. ఇంకొన్నిసార్లు భార్యా భర్తను కొడుతుందని భర్త భార్యని కొడుతున్నాడని ఇంట్లోంచి వెళ్లిపోవడం లేదంటే, సూసైడ్ చేసుకోవడం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇంకొందరు అయితే ఎన్ని గొడవలు వచ్చినా కూడా సర్దుకుని పోతూ ఉంటారు.
కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఘటన మాత్రం అందుకు పూర్తి విరుద్ధం అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే వార్త వినడానికి కాస్త బాధగా విడ్డూరంగా కూడా ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. యూసీలోని కోపగంజుకు చెందిన రామ్ ప్రవేశ్ అనే వ్యక్తి తన భార్య తరచూ కొడుతుందని ఏకంగా 100 అడుగుల తాటి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. తాటి చెట్టు మీద ఒకటి కాదు రెండు కాదు నెల రోజుల నుంచి అక్కడే ఉంటున్నాడు. కాగా కుటుంబ సభ్యులు నెల రోజుల నుంచి అతనికి తాడు సహాయంతో నీళ్లు ఆహారం పైకి అందిస్తున్నారు.
ఇది ఒక వార్త అయితే ఆ వ్యక్తి తమ ఇళ్లలో ఏం జరుగుతుందో తొంగి చూడడం కోసమే ఇలా చెట్టు పైకి ఎక్కాడు అంటూ ఆ ఊరి గ్రామస్తులు భావించడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు వచ్చినా కూడా ఏం లాభం లేకపోయింది. పోలీసులు వచ్చి రామ్ ప్రవేశ్ ను కిందికి దించడానికి ఎంత ప్రయత్నించినా కూడా అతను మాత్రం కిందికి రాలేదు. కాగా ఎందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా 42 ఏళ్ల రామ్ ప్రవేశ్ భార్య కొట్టే దెబ్బలు రోజురోజుకి ఎక్కువ అవుతుండడంతో ఆ దెబ్బలు తాళలేక అతడు ఆ విధంగా చెట్టెక్కి కూర్చున్నాడట.