Uniform Civil Code :`ఉమ్మడి పౌరస్మృతి’లో ఎన్నో మెలికలు
యూనిఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి) (Uniform Civil Code) ముస్లింలకు వ్యతిరేకం చట్టం ఏ మాత్రం కాదు.వ్యతిరేకమంటూ ఫోకస్ అవుతోంది
- By CS Rao Published Date - 01:38 PM, Sat - 22 July 23

యూనిఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి) (Uniform Civil Code) ముస్లింలకు వ్యతిరేకం చట్టం ఏ మాత్రం కాదు. కేవలం మోడీ, బీజేపీ ప్రవేశపెడుతోన్న కారణంగా ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకమంటూ ఫోకస్ అవుతోంది. నిజంగా యూనిఫాం సివిల్ కోడ్ తీసుకువస్తే కేవలం ‘ముస్లిం పర్సనల్ లా’ మాత్రమే కాదు, ‘హిందూ పర్సనల్ లా’ సైతం మారుతుంది. చివరకు “హిందూ అన్ డివైడెడ్ ఫామిలీ ఎక్సెంప్షన్ టాక్స్”ను సైతం తొలగించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 371 ప్రకారం 12 రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపుల చట్టం సైతం రద్దు చేయాల్సి ఉంటుంది. హిందూ ఆచారాల ప్రకారం ఏడడుగులూ, మూడు ముళ్ల వివాహాలు కూడా ఉండవు అందరూ కాంట్రాక్ట్ పద్ధతిలో పెళ్లిళ్లు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉమ్మడి పౌరస్మృతి ముస్లింలకు వ్యతిరేకం చట్టం(Uniform Civil Code)
ఒకే దేశం ఒకే చట్టం నినాదంతో వస్తోన్న యూనిఫాం సివిల్ కోడ్ భారతదేశ దళితులకు, ముస్లిం, మైనార్టీలన్న తారతమ్యం లేకుండా రాజ్యసభల్లో సమాన హోదాలు ఇవ్వటానికి సిద్ధమేనా? రాష్ట్రపతి ముర్ముకు ఆహ్వానం అందని దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ ఆధారంగా దళితులకు రాజ్యసభల్లో అందరితో పాటు సమాన హోదాలు ఇవ్వటం సాధ్యమేనా? అనేది పెద్ద ప్రశ్న. పైగా మద్యపాన నిషేధం ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఉంది. గుజరాత్, లక్షద్వీప్, నాగాలాండ్, మిజోరాం రాష్టాల్లో మద్యం సంపూర్ణ నిషేధం ఉంది. యూనిఫాం సివిల్ కోడ్ (Uniform Civil Code) తీసుకొస్తే ఈ రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాల్లోనూ సంపూర్ణ మద్య నిషేధం సాధ్యమేనా? అంటే కానేకాదు. కాబట్టి ఈ చట్టం ముస్లిముల సమస్య ఎంత మాత్రం కాదు.
హంగర్ ఇండెక్స్ లో ఇండియా పాకిస్తాన్ కంటే వెనుకబడి
హిందూ, ముస్లిం పోలరైజేషన్ తీసుకురావటం, ఆర్టికల్ 370, రామ్ మందిర్, ట్రిపుల్ తలాక్, సీఎఎ, ఎన్.ఆర్.సీ ల క్రమంలో ఎలక్షన్స్ కు ముందు “యూనిఫాం సివిల్ కోడ్” తీసుకురావటం భావోద్వేగాలను రెచ్చగొట్టే ఓ పోలిటికల్ స్టంట్ గా సామాజిక విశ్లేషకుల భావన. కానీ, రాజ్యాంగంలో 44 వ ఆర్టికల్లో రాసిన దాన్నే అమలు పరుస్తున్నామని బీజేపీ చెబుతోంది. అదే రాజ్యాంగంలో అతి ప్రధానమైన ఇతర ఆర్టికల్స్ కూడా ఉన్నాయని ప్రత్యర్థులు గుర్తు చేస్తున్నారు.
ఉదాహరణకు ఆర్టికల్ 39 ప్రకారం “దేశంలో పౌరులైన స్త్రీ, పురుషులందరూ సమానమైన జీవనోపాధికి తగిన మార్గాలను కలిగి ఉండాలి. ఆర్టికల్ 39 ప్రకారం “దేశంలో ఆర్థిక సంపద మొత్తం కొద్ది మంది చేతుల్లో కేంద్రీకరించబడకూడదు. దేశ సంపద ప్రస్తుతం కొందరు బిలియనీర్ల చేతిలో వెళ్లిపోతుంది. ఆర్టికల్ 47 తీసుకుంటే “కేంద్ర ప్రభుత్వం పోషకాహార స్థాయిని, మెరుగైన జీవన ప్రమాణాలను పెంచాలి మరియు ప్రజారోగ్యాన్ని మెరుగుపరచటం ప్రభుత్వ ప్రాధమిక విధి”. హంగర్ ఇండెక్స్ లో ఇండియా పాకిస్తాన్ కంటే వెనుకబడి ఉన్న దారుణమైన పరిస్థితి. ఆర్టికల్ 48A ప్రకారం “దేశ పర్యావరణం రక్షించబడాలి, అడవులు, వన్య ప్రాణులు రక్షించబడాలి. కానీ, ప్రపంచంలో అత్యంత కాలుష్యంతో నిండిన నగరాలు భారత్ సొంతం. ఆర్టికల్ 44 కంటే మిగిలిన వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి(Uniform Civil Code)
ఒక దేశం ఒక చట్టం” ద్వారా భారతదేశంలో “జాతి సమైక్యత”
“డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961” ప్రకారం కట్నం తీసుకోవటం, ఇవ్వటం కూడా నేరమే. ఈ చట్టం “యూనిఫాం సివిల్ కోడ్”గానే పరిగణించబడుతుంది. “చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 1929” ప్రకారం బాల్య వివాహాలు చేసుకోవటం నేరం. ఈ చట్టం కూడా “యూనిఫాం సివిల్ కోడ్” గానే పరిగణించబడుతుంది. “ప్రీ-కాన్సెప్షన్ మరియు ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ చట్టం, 1994” ప్రకారం గర్భంలో లింగ నిర్ధారణ నేరం. భ్రూణ హత్యలను నివారించటానికి చేసిన ఈ చట్టం సైతం “యూనిఫాం సివిల్ కోడ్” గానే (Uniform Civil Code) పరిగణించబడుతుంది. 12 యేళ్ల కంటే తక్కువ మైనర్ అమ్మాయిల్ని రేప్ చేస్తే ఊరి శిక్ష విధించబడుతుందన్న ఫోక్సో చట్టం ద్వారా ఎంతమందిని ఉరి తీస్తున్నారు? అనే అంశాలపై ప్రశ్నలు వేసుకుంటే చట్టాల అమలు తీరు దారుణంగా ఉందని అర్థమవుతోంది.
యూనిఫాం సివిల్ కోడ్ భారత్ లో అమలు సాధ్యం(Uniform Civil Code)
“స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954” ప్రకారం వివిధ మతాలు, కులాలకు చెందిన స్త్రీ, పురుషులు వివాహం చేసుకోవచ్చు. ఈ చట్టం సైతం “యూనిఫాం సివిల్ కోడ్” గానే పరిగణించబడుతుంది. చిత్రం ఏమిటంటే ఈ చట్టానికి భిన్నంగా మరోప్రక్క గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో “లవ్ జిహాద్” చట్టం తీసుకురాబడింది. దాని ప్రకారం ఒక మతానికి చెందిన అబ్బాయిలు/అమ్మాయిలు మరో మతానికి చెందిన అబ్బాయిలు/అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవటం నేరం. ఈ రకంగా “యూనిఫాం సివిల్ కోడ్” అనేక చట్టాల్లో ఇప్పటికే ఉంది. “ఒక దేశం ఒక చట్టం” ద్వారా భారతదేశంలో “జాతి సమైక్యత” ఏర్పడుతుందనుకోవటం పొరబాటే.
“యూనిఫాం సివిల్ కోడ్” (Uniform Civil Code) ద్వారా ప్రజల్లో ‘జాతి సమక్యత’ తీసుకొస్తారని ఆశపడటం నేతి బీరకాయ నుండి నేతిని ఆశించటం లాంటిదే అవుతుంది. 21 వ లా కమిషన్ ఆఫ్ ఇండియా ఆగస్టు 2018లోనే కేంద్ర ప్రభుత్వానికి “యూనిఫాం సివిల్ కోడ్” అన్నది అవాంఛనీయమైనదని చెప్పింది. కానీ, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఈ చట్టానికి ఆమోదం తెలపడానికి మోడీ సర్కార్ సిద్దమవుతోంది.
భిన్న మతాలు, విశ్వాసాలు, సంస్కృతుల సమ్మేళనం కలిగిన భారతదేశంలో వివిధ మతాల, సంస్కృతుల, విధానాల, విశ్వాసాలకు అతీతంగా వివాహాలు, విడాకులు, వారసత్వం, ఆస్తి పంపకాలు, గార్డియన్ షిప్, దత్తత వగైరా అంశాలలో ఒకే చట్టాన్ని అమలు చేయడం యూనిఫాం సివిల్ కోడ్” లక్ష్యం. ఈ సున్నిత అంశంపై ప్రస్తుతం 22 వ లా కమిషన్ ప్రజలు, వివిధ మత సంస్థలతో సహా అన్ని వర్గాల నుండి 30 రోజుల లోగా సలహాలు, సూచనల ఇవ్వాల్సిందిగా ప్రకటించింది.
క్రిమినల్ లా” “యూనిఫాం సివిల్ కోడ్ , (సివిల్ లా)
భారతరాజ్యాంగంలో “పౌర స్మృతి (సివిల్ లా)” మరియు “శిక్షాస్మృతి (క్రిమినల్ లా)” అని రెండు విభాగాలు ఉంటాయి. వీటిలో “శిక్షాస్మృతి” అన్నది భారత దేశంలో మతాలకతీతంగా అందరికీ సమానంగా వర్తిస్తుంది. అంటే, భారతదేశంలో “యూనిఫాం సివిల్ కోడ్” “శిక్షాస్మృతి (క్రిమినల్ లా)” విభాగంలో ఉంది. మరి ఇప్పుడు “యూనిఫాం సివిల్ కోడ్” (Uniform Civil Code) దేనికి అంటే “పౌర స్మృతి (సివిల్ లా)” లో సైతం ఒకే రకమైన చట్టాన్ని తీసుకొచ్చి వివిధ మతాల్లో ఉన్న “వ్యక్తిగత చట్టాల (పర్సనల్ లా)”ను తొలగించి వారికి రాజ్యాంగం ఇచ్చిన “మతస్వేచ్ఛ హక్కు (రైట్ టు రిలిజియస్ ఫ్రీడం)”ను ఎత్తేయ్యటం “యూనిఫాం సివిల్ కోడ్” ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
యూనిఫాం సివిల్ కోడ్ భారత్ లో అమలు సాధ్యం కాదని చెప్పడానికి గోవాలో అమలు అవుతోన్న “యూనిఫాం సివిల్ కోడ్” ను తీసుకోవచ్చు. అక్కడ అమలు అవుతున్నప్పుడు మిగతా రాష్ట్రాల్లో ఎందుకు సాధ్యం కాదు? అని కొందరు ప్రశ్నించవచ్చు. నిజానికి గోవాలో అమలవుతున్న “యూనిఫాం సివిల్ కోడ్” సైతం “సోకాల్డ్-యూనిఫాం సివిల్ కోడ్” అనే చెప్పాలి. గోవాలో క్రైస్తవుల పెళ్లిళ్లకు సంబంధించి వేరే చట్టాలుంటే అక్కడి హిందువులకు వేరే చట్టాలున్నాయి.
Also Read : Uniform Civil Code : యూసీసీపై కేంద్రం కీలక ప్రకటన.. విధివిధానాల ప్రశ్నే తలెత్తదని వెల్లడి
“25 సం.ల వరకు ఒకవేళ భార్య బిడ్డను కనకపోయినా, లేదా 30 సం.ల లోపు కొడుకును కనకపోయినా ఆ హిందూ పురుషుడు వేరే స్త్రీని సైతం నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు”. అంటే హిందూ పురుషుడు “బహుభార్యత్వం” కలిగి ఉండవచ్చన్న మాట. ఇంత గమ్మత్తైన చట్టం గోవాలో హిందూ పురుషుల కోసం తయారు చెయ్యబడితే గోవాలో ఉన్న ఈ భిన్నమైన చట్టాలకు “యూనిఫాం సివిల్ కోడ్” అన్న పేరు తగిలించటం ఇంకా విచిత్రం. ఇలాంటి పరిస్థితులు కామన్ సివిల్ కోడ్ అమలులో ఉన్న గోవాలో ఉంటే, మిగిలిన దేశమంతా సాధ్యమా? అంటే కానేకాదని చెప్పొచ్చు.
50 దేశాలు, 50 చట్టాలున్న అమెరికాలో ప్రజలు సమైక్యంగా లేరా?
అగ్రరాజ్యమైన అమెరికా ఉన్న 50 రాష్ట్రాల్లో 50 రకాలా వేర్వేరు చట్టాలున్నాయన్న విషయం ఎంతమందికి తెలుసు? మరి వేర్వేరు పౌర స్మృతులు లేదా వ్యక్తిగత చట్టాలు ఉన్న అమెరికా 50 రాష్ట్రాల ప్రజలు కొట్టుకోవడలేదు. అమెరికా లో యూనిటీ లేదా? జాతి సమైక్యత లేదా? అభివృద్ధి పదంలో లేదా? బ్రిటన్, సౌత్ ఆఫ్రికా, కెన్యా, గ్రీస్ లాంటి క్రిస్టియన్ మెజారిటీ దేశాలు, ఇండోనేషియా, పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి ముస్లిం మెజారిటీ దేశాలను తీసుకున్నా ఆయా దేశాల్లో క్రిమినల్ లా ఒక్కటే ఉన్నప్పటికీ వేర్వేరు “వ్యక్తిగత చట్టాలు (సివిల్ లాస్)” అమలు పరచబడుతున్నాయి.
Also Read : Uniform Civil Code: యూనిఫాం సివిల్ కోడ్‌పై తమిళిసై కీలక వ్యాఖ్యలు
మొదటి ప్రపంచ యుద్ధంలో ఓ వైపు పాల్గొన్న జర్మనీ, ఇటలీ తదితర దేశాలు ఉండగా మరోవైపు బ్రిటన్, ఫ్రాన్స్ మొదలైన దేశాలు ఉన్నాయి. ఈ యుద్ధంలో 30 మిలియన్ల మంది చనిపోయారు. ఆ యుద్ధం చేసిన ఇరువర్గాలూ అవలంబించేది క్రైస్తవ మతాన్నే. అంతేకాదు అందరికీ “కామన్ సివిల్ కోడ్” ఉండేది. ఈ ఒకే చట్టం ఆయా దేశాల మధ్య యుద్ధాన్ని నివారించలేకపోయింది. అంటే కామన్ సివిల్ కోడ్ సమైక్యతను పెంచుతుందని చెప్పడం నేతిబీరలో నెయ్యి ఎంత నిజమో అంతే.
Also Read : Congress-Uniform Civil Code : యూసీసీపై కాంగ్రెస్ వైఖరి చెప్పేది అప్పుడేనట !?
ఆర్టికల్ 44 లో అంబేద్కర్ స్త్రీల ఆర్ధిక సమానత్వం, వెనుకబడిన కులాల వారి సంరక్షణ కోసం యూనిఫాం సివిల్ కోడ్(Uniform Civil Code) తేవటానికి ప్రయత్నించాలని” భావించారు. అదే రాజ్యాంగంలో ఆర్టికల్ 25 కూడా ఉంది. దాని ప్రకారం దేశంలో వివిధ మతాల ప్రజలు మత విశ్వాసాల ప్రకారం, ఆచారాల ప్రకారం నడుచునే “మత స్వేఛ” కూడా కలిగి ఉన్నారు. రాజ్యాంగం రాస్తున్న సమయంలోనే యూనిఫాం సివిల్ కోడ్ ప్రాక్టికల్ గా అమలు చెయ్యటం సాధ్యం కాదని కమిటీ పేర్కొంది. “వ్యక్తిగత చట్టాలను (పర్సనల్ లాస్)” ను రూపొందించే అధికారాన్ని “యూనియన్ లిస్ట్”లో కాకుండా “కంకరెంట్ లిస్ట్” పెట్టటం జరిగింది. దాని ప్రకారం కేవలం ఒక్క కేంద్రానికే కాకుండా, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తమ తమ చట్టాలను రూపొందించుకునే హక్కు ఉంటుంది. ఇలాంటి క్లిష్టమైన చట్టాన్ని అమలు చేయడం భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉన్న భారత్ లో సాధ్యమా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.