HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Thousands Of Crores Scam In The Name Of Beautification Of Musi Ktr

KTR : మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల స్కాం: కేటీఆర్

KTR: ఎస్టీపీల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. కూకట్‌పల్లి ఎస్టీపీని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

  • Author : Latha Suma Date : 25-09-2024 - 12:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR Tweet
KTR Tweet

KTR Key Statements about Musi River Development: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలతో కలిసి ఫతేనగర్‌, కూకట్‌పల్లిలోని మురుగు నీటి శుద్ధి కేంద్రాలను పరిశీలించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ఎస్టీపీల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. కూకట్‌పల్లి ఎస్టీపీని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. అదేవిధంగా కూకట్‌పల్లి నాలాను శుద్ధి చేయాలని సూచించారు.

Read Also: Hyderabad : సంక్షోభంలో హైదరాబాద్ ..?

హైదరాబాద్‌ ను మురికినీటి రహిత నగరంగా మార్చాలనే గొప్ప లక్ష్యంగా తమ ప్రభుత్వ హయాంలో ఎస్టీపీలను ప్రారంభించామని పేర్కొన్నారు. మొత్తం తమ హయాంలో రూ.3,866 కోట్లతో 31 ఎస్టీపీల నిర్మాణాలను చేపట్టామని గుర్తు చేశారు. మూసీ సుందరీకరణ పేరులో కాంగ్రెస్‌ సర్కార్ రూ.వేల కోట్ల స్కాంకు తెర లేపిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రాజెక్టుకు రూ.లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టే అవసరం ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆ పనులను సైతం ఓ పాకిస్తాన్ కంపెనీకి అప్పగించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఫతేనగర్ ఎస్టీపీల్లో(మురుగు శుద్ధి కేంద్రం) శుద్ధి చేసిన నీరంతా మూసీ నదిలోకి వెళ్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. దాదాపు 94శాతం స్వచ్ఛమైన నీరు మూసీలోకి వెళ్తున్నపుడు మళ్లీ మూసీ శుద్ధి ఎందుకని కేటీఆర్ నిలదీశారు.

కాగా, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో హామీలను నెరవేర్చలేదన్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్రూం విషయంలో ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసం చేశారన్నారు. ఇక, హైడ్రా పేరుతో పేదలకు ఒక న్యాయం, ధనవంతులకు మరో న్యాయం చేస్తున్నారని విమర్శలు చేశారు. అలాగే ఎస్టీపీల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని చెప్పారు.

Read Also: Youtuber Harsha Sai : హర్షసాయి కోసం పోలీసుల గాలింపు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Ready
  • ktr
  • Musi River Development
  • Musi River front Project

Related News

    Latest News

    • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

    • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

    • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

    Trending News

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd