What An Idea! ఐడియా అదుర్స్…కొత్త పెళ్లి కొడుకు కొత్త జోష్.!!
- By Hashtag U Published Date - 10:07 AM, Fri - 29 April 22

మే నెల రాకముందే దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండవేడిమి తాళలేక నానావస్థలు పడుతున్నారు. చల్లదనం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. శీతలపానీయాలను ఆశ్రయిస్తున్నారు. తప్పనిసరి అయితేనే బయటకు వెళ్లాలనుకునేవారు…ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నారు. వెంట వాటర్ బాటిల్, ఎండ నుంచి రక్షణ కోసం గొడుగు వంటివి తీసుకెళ్తున్నారు.
ఇక ఎండాకాలం అంటేనే పెళ్లిల సీజన్. ఇప్పుడు పెళ్లి సీజనే నడుస్తోంది. ఎండలు దంచికొడుతున్నా పెళ్లిలు ఆగవ కదా. ఎండలను తట్టుకునేందుకు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. తాజాగా ఓ పెళ్లివారు కూడా ఇలాంటి ఏర్పాట్లే చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీియాలో వైరల్ అవుతోంది. ఈ పెళ్లివారు చేసిన ఐడియా అదుర్స్ అని చెప్పాలి. వరుడిని గుర్రంపై ఊరేగిస్తూ..పెళ్లి మండపానికి తీసుకెళ్లాలి. అయితే ఎండలు భారీగా ఉండటంతో పెళ్లి నిర్వాహకులకు కొత్త ఐడియా వచ్చింది. పెళ్లిబ్రుందం వరకు పెద్ద పరదాను ఏర్పాటు చేశారు. చతురస్రాకారంలోని టెంటుకు నాలుగు మెటల్ ఫ్రేమ్స్ ఏర్పాటు చేశారు. వాటిని నాలుగు దిక్కులు పట్టుకునేందుకు నలుగురు మనుషులను ఏర్పాటు చేశారు. ఇలా టెంటును ముందుకు తీసుకెళ్తూ ఎండ నుంచి రక్షణ పొందారు. ఈ ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది. పెళ్లివాళ్లు ఇలా వెళ్లడం గమనించిన కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోను చూసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్లు లైకులు చేస్తున్నారు. మరికొంద మంది అదిరందయ్యా చంద్రం అంటూ కామెంట్లు పెడుతున్నారు.
https://twitter.com/DevyaniKohli1/status/1519267919322316800