232 Crore – A Car : అదానీ, అంబానీ కూడా కొనలేని లగ్జరీ కారు.. విశేషాలివీ
232 Crore - A Car : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారును చూశారా ? దాని ధర ఎంతో తెలుసా?
- By Pasha Published Date - 02:23 PM, Sun - 18 February 24
232 Crore – A Car : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారును చూశారా ? దాని ధర ఎంతో తెలుసా? ‘రోల్స్ రాయిస్ బోట్ టెయిల్’ కారు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. అక్షరాలా రూ.232 కోట్లు పెడితే మనం ఈ కారును కొనుక్కోవచ్చు. ఇప్పటి వరకు ఈ కారును ప్రపంచంలో ముగ్గురే కొన్నారు. దీని విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
రోల్స్ రాయిస్ కంపెనీ ఈ కారుకు ‘బోట్ టెయిల్’ అని పేరు పెట్టడానికి ఓ కారణం ఉంది. వాస్తవానికి ఈ కారు డిజైన్ దాదాపు రేసింగ్ బోట్లా ఉంటుంది. కారు వెనుక ఉన్న డెక్‌ను పిక్నిక్ టేబుల్లా మార్చుకునే వీలుంటుంది. అందుకే దీనికి ‘బోట్ టెయిల్’ అని పేరు పెట్టారు. రోల్స్ రాయిస్ బోట్ టెయిల్ కారును కార్బన్ ఫైబర్ కవర్‌తో రూపొందించారు. ఇది కన్వర్టబుల్ ఓపెన్ టాప్ రూఫ్‌తో వస్తుంది. ఈ కారులో నాలుగు లగ్జరీ సీట్స్ ఉంటాయి. కారు వెనుక భాగంలో ఉన్న డెక్‌లో కాక్టెయిల్ స్టోర్ ఉంటుంది. ఇందులో మనకు నచ్చిన డ్రింక్స్ ఉంచుకోవచ్చు. దీనిలో కన్వర్టబుల్ టేబుల్స్, చైర్స్ కూడా ఉంటాయి. పిక్నిక్లకు, విహార యాత్రలకు వెళ్లినప్పుడు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ కారులోని(232 Crore – A Car) బూట్ డోర్స్‌ను ఓపెన్ చేస్తే, సీతాకోకచిలుక రెక్కలలా విచ్చుకుంటాయి.
Also Read :Driving Tips : కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారా ? ఇవీ టిప్స్
రోల్స్ రాయిస్ బోట్ టెయిల్ కారులో వీ12 6.75 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 563 bhp పవర్ జనరేట్ చేస్తుంది. ఈ కారు పూర్తిగా హ్యాండ్‌మేడ్ కావడం గమనార్హం. దీనిని పూర్తి చేయడానికి ఏకంగా నాలుగేళ్లు పట్టిందని కంపెనీ వెల్లడించింది. రోల్స్ రాయిస్ కంపెనీ 2017లో స్వెప్టైల్ కారును లాంఛ్ చేసింది. దాన్ని ప్రేరణగా తీసుకొని రోల్స్ రాయిస్ బోట్ టెయిల్ కారును రూపొందించింది. ఇప్పటి వరకు ముగ్గురు మాత్రమే ఈ సూపర్ లగ్జరీ కారును కొన్నారు. డైలీ మెయిల్ ప్రకారం, ప్రముఖ మ్యూజిక్ కపుల్ జే-జెడ్, బియాన్స్ వద్ద ఒక రోల్స్ రాయిల్ బోట్ టెయిల్ కారు ఉంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ మౌరీ ఇకార్డి దగ్గర మరొకటి ఉంది. మూడోది మరొక గుర్తుతెలియని బిలియనీర్ జంట వద్ద ఉంది.
Also Read : Floating Bridge : వైజాగ్ బీచ్‌లో ‘ఫ్లోటింగ్ బ్రిడ్జ్’.. ప్రత్యేకతలు ఇవిగో
Tags
Related News
Expensive Cars: ఈ నలుగురు ఆటగాళ్ల దగ్గర లగ్జరీ కార్లు, బ్రాండెడ్ వాచీలు..!
సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అనే నలుగురు పేర్లు భారత క్రికెట్ జట్టు పరిస్థితి, దిశ రెండింటినీ మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఇది కాకుండా వారి వద్ద లగ్జరీ కార్లు, బ్రాండెడ్ వాచీల (Expensive Cars) పెద్ద సేకరణ ఉంది.