Chandrayaan 3 – 14 Days Life : 14 రోజులే లైఫ్.. చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్ జీవితకాలం అంతే !!
Chandrayaan 3 - 14 Days Life : ఇవాళ చంద్రుడిపై మన చంద్రయాన్-3 ల్యాండ్ కాబోతోంది. సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రయాన్-3 ల్యాండర్ ‘విక్రమ్’.. జాబిల్లిపై అడుగు మోపబోతోంది.
- By Pasha Published Date - 12:25 PM, Wed - 23 August 23

Chandrayaan 3 – 14 Days Life : ఇవాళ చంద్రుడిపై మన చంద్రయాన్-3 ల్యాండ్ కాబోతోంది. సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రయాన్-3 ల్యాండర్ ‘విక్రమ్’.. జాబిల్లిపై అడుగు మోపబోతోంది. ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగిన వెంటనే.. అందులో నుంచి రోవర్ ‘ప్రజ్ఞాన్’ బయటికి ఎంట్రీ ఇస్తుంది. అది చంద్రుడిపై చకచకా తిరుగుతూ భూమి నుంచి మన ఇస్రో ఇచ్చే కమాండ్స్ కు అనుగుణంగా రీసెర్చ్ చేస్తుంది. చంద్రుడి ఉపరితలం ఫొటోలు తీసి పంపుతుంది. చంద్రుడి లోపల ఖనిజ వనరులు ఉన్నాయా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ చేయడానికి అవసరమైన సాంకేతిక సామగ్రి ‘ప్రజ్ఞాన్’ రోవర్ లో ఉన్నాయి. అయితేే గమనించాల్సిన విషయం ఏమిటంటే.. చంద్రయాన్-3 ల్యాండర్ ‘విక్రమ్’, రోవర్ ‘ప్రజ్ఞాన్’ ల జీవితకాలం కేవలం 14 రోజులే !! ఈవిషయాన్ని గతంలోనే ఇస్రో ప్రకటించింది. అయితే పరిస్థితులు బాగా అనుకూలిస్తే మరో 14 రోజులు కూడా దాని లైఫ్ టైం పెరిగే అవకాశాలు ఉంటాయని పేర్కొంది.
Also read : Chandrayaan 3 Vikram Lander : భారీ సవాళ్ల మధ్య విక్రం ల్యాండింగ్
చంద్రుడిపై రాత్రి అంటే మజాకా ?
చంద్రుడిపై ఒక రాత్రి వ్యవధి అనేది మన భూమిపై ఉండే 13.5 రోజులకు సమానం. చంద్రుడి టైం లెక్కన చూసుకుంటే.. అక్కడ మన ‘విక్రమ్’, ‘ప్రజ్ఞాన్’ లు జీవించేది ఒక్క రాత్రి మాత్రమే. మన భూమి టైం లెక్కన చూసుకుంటే అది దాదాపు రెండు వారాలు. ఈ 14 రోజుల టైంను (Chandrayaan 3 – 14 Days Life) రీసెర్చ్ కోసం మన ‘విక్రమ్’, ‘ప్రజ్ఞాన్’ లు వాడుకుంటాయి. చంద్రుడిపై ఉదయం టైంలోనే ఇవి యాక్టివ్ గా పనిచేస్తాయి. రాత్రి అయితే రీసెర్చ్ చేసేందుకు వాటిలోని సాంకేతిక పరికరాలు సహకరించవు. చంద్రుడిపై రాత్రివేళ అంతటి దారుణమైన చల్లటి వాతావరణం ఉంటుంది. టెంపరేచర్ మైనస్ 200 డిగ్రీల సెల్సీయస్ దాకా పడిపోతుంది. దీంతో చంద్రయాన్ 3 ల్యాండర్, రోవర్ లలో ఉన్న పరికరాలు పనిచేసేందుకు సహకరించవు. చంద్రుడిపై తెల్లారగానే ల్యాండర్ విక్రమ్, రోవర్ ‘ప్రజ్ఞాన్’ యాక్టివిటీని కొనసాగిస్తాయి.