Telephobia: టెలిఫోబియా అంటే ఏమిటి? బాధితులుగా 25 లక్షల మంది!
తాజాగా ఓ సంస్థ విడుదల చేసిన గణాంకాలను చూస్తే.. బ్రిటన్‌లో 25 లక్షల మందికి పైగా యువత మొబైల్ రింగ్ విని భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొంది.
- By Gopichand Published Date - 01:31 PM, Sun - 2 February 25

Telephobia: ప్రస్తుతం మొబైల్ ఫోన్ అనేది కమ్యూనికేషన్‌కు ఒక మాధ్యమం (Access Use Of Mobile) మాత్రమే కాదు.. ఇది ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. మొబైల్ ఫోన్ లేకుండా ప్రజలు గంట కూడా గడపడం కష్టం. ఎందుకంటే దీని ద్వారా లావాదేవీలు, షాపింగ్‌తో సహా చాలా వరకు ఇంట్లో కూర్చొని పనులు పూర్తి చేస్తున్నారు. అయితే మొబైల్ ప్రజల జీవితాలను ఎంత సులభతరం చేసిందో.. అంతే స్థాయిలో సమస్యలను కూడా కలిగిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మొబైల్ ఫోన్‌లను అధికంగా ఉపయోగించడం కారణంగా ప్రజలు ఇప్పుడు అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు.
బ్రిటన్‌లో యువతలో ఈ వ్యాధి పెరుగుతోంది
ఫోన్‌ను ఉపయోగించడం అనే వ్యసనానికి భిన్నంగా ఈ రోజుల్లో చాలా మంది మొబైల్ రింగ్ వింటేనే భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా ఓ సంస్థ విడుదల చేసిన గణాంకాలను చూస్తే.. బ్రిటన్‌లో 25 లక్షల మందికి పైగా యువత మొబైల్ రింగ్ విని భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ వ్యాధిని కాల్ యాంగ్జయిటీ లేదా టెలిఫోబియా (Telephobia) అంటారు.
Also Read: India vs England 5th T20I: నేడు ఇంగ్లండ్‌తో టీమిండియా చివరి టీ20.. ప్రయోగాలకు సిద్ధమైన భారత్?
టెలిఫోబియా అంటే ఏమిటి?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. టెలిఫోబియా అనే వ్యాధి ప్రాథమికంగా ఒత్తిడికి సంబంధించిన లక్షణం. ఈ పరిస్థితిలో ఎవరితోనూ మాట్లాడాలని అనిపించదు లేదా కాల్‌ని తీయాలని అనిపించదు. దీంతో ప్రజలు నిశబ్దంగా ఉండడంతో పాటు మొబైల్ ఫోన్‌లు మోగడంతో భయాందోళనకు గురవుతున్నారు. నివేదికల ప్రకారం లక్షలాది మంది ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నారు.
చికిత్స ఉందా?
దీనికి చికిత్స చేయడానికి బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్ కళాశాలలో కోచింగ్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో విద్యార్థులకు ఫోన్ కాల్‌లలో ఎలా మాట్లాడాలో నేర్పిస్తున్నారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే టెలిఫోబియాను అధిగమించడంలో వారికి సహాయపడుతుంది. అలాగే టెలిఫోబియాతో బాధపడే వారు తమ అభిప్రాయాలను ఫోన్‌లో ఎలా చెప్పవచ్చో తెలియజేస్తున్నారు. అంతే కాకుండా కోచింగ్ క్లాస్‌లో కూడా తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పే విధంగా నేర్పిస్తున్నారు.
యువతలో ఈ వ్యాధి ఎందుకు పెరుగుతోంది?
ఒక అధ్యయనం ప్రకారం.. నేటి యువతలో చాలా మంది సందేశాల ద్వారా మాత్రమే సంభాషించుకుంటారు. చాలా అరుదుగా వారు ఒకరితో ఒకరు కాల్ చేసుకోవడం ద్వారా మాట్లాడతారు. అందుకే కాల్‌లో తడబడుతుంటారు. 18 నుండి 34 సంవత్సరాల మధ్య 70% మంది వ్యక్తులు సందేశాలతోనే మాట్లాడటానికి ఇష్టపడతారని ఒక సర్వేలో తేలింది. ఎందుకంటే ఇది వారికి కంఫర్ట్ జోన్. దీంతో కాల్ రింగ్ వినగానే చాలా మంది టెలిఫోబియా బారిన పడుతున్నారు.