Supreme Court : ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ప్యానెల్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
Supreme Court : గాలిలోనే మొత్తం కలుషితం ఉన్నదని, ఎన్సీఆర్ రాష్ట్రాలకు చెప్పినట్లు ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ పనిచేయడం లేదని జస్టిస్ ఓకా తెలిపారు.
- By Latha Suma Published Date - 05:17 PM, Fri - 27 September 24

Air quality in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత సరిగా లేని అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. వాయు నాణ్యతను పర్యవేక్షించడానికి, కాలుష్యాన్ని నియంత్రించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వాయు నాణ్యత నిర్వహణ కమీషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, ఏజీ మాసిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. గాలిలోనే మొత్తం కలుషితం ఉన్నదని, ఎన్సీఆర్ రాష్ట్రాలకు చెప్పినట్లు ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ పనిచేయడం లేదని జస్టిస్ ఓకా తెలిపారు.
Read Also: Ravichandran Ashwin: అశ్విన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు
కమిటీలు ఏర్పాటు చేసి ఒక్క చర్య కూడా తీసుకోవడం లేదన్నారు. సీఏక్యూఎం పూర్తిగా పనిచేయలేదని చెప్పడం లేదని, కానీ అనుకున్న రీతిలో ఆ ప్యానెల్ పర్ఫార్మ్ చేయలేదని జస్టిస్ ఓకా వెల్లడించారు. శీతాకాల సమయంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర వాయు కాలుష్యం నమోదు అయ్యే విషయం తెలిసిందే. పంట వ్యర్ధాలను కాల్చడం వల్ల హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో వాయు కాలుష్యం జరుగుతున్నది. మీరు తీసుకున్న చర్యల వల్ల కాలుష్యం తగ్గిందా అని సీఏక్యూఎం చైర్మెన్ రాజేశ్ వర్మను సుప్రీంకోర్టు అడిగింది.
అయితే CAQM ఎలాంటి చర్య తీసుకోలేదని తాము చెప్పడం లేదు కానీ ఆశించిన విధంగా పని చేయలేదని బెంచ్ పేర్కొంది. మూడు నెలలకు ఒకసారి తాము సమావేశం అవుతున్నామని CAQM చైర్మన్ రాజేష్ వర్మ తెలియజేయగా.. సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అంత సమయం సరిపోతుందా? మీరు తీసుకున్న నిర్ణయాలు సమస్యలకు పరిష్కారం చూపుతున్నాయా? పంట వ్యర్ధాలు తగులబెట్టే సంఘటనలు తగ్గుముఖం పడుతున్నాయా అని కోర్టు ప్రశ్నించింది.
Read Also: YS Jagan: రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోంది: వైఎస్ జగన్
అలాగే తప్పు చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కూడా చైర్మన్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే కేంద్రం తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి.. రెండు వారాల క్రితమే చైర్మన్ చేరారని తెలిపారు. పంజాబ్, హర్యానా అధికారులు, పొల్యూషన్ బోర్డుతో సమావేశాలు జరిగాయని, వారి ప్రధాన కార్యదర్శులకు హెచ్చరికలు జారీ చేశారని CAQM చైర్మన్ తెలిపారు. అనంతరం కాలుష్య నియంత్రణకు ఏర్పాటు చేసిన సమావేశాల వివరాలు, చర్యలను తమ ముందుకు తీసుకురావాలని చెబుతూ.. విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది ధర్మాసనం.