Sovereign Gold Bond : లక్ష పెడితే రెండున్నర లక్షలు.. కాసులు కురిపిస్తున్న ‘గోల్డ్ బాండ్లు’!
Sovereign Gold Bond : 2016 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్-II ఎనిమిదేళ్ల మెచ్యూరిటీ పీరియడ్ ఈనెల 28తో ముగియబోతోంది.
- By Pasha Published Date - 02:12 PM, Sat - 23 March 24

Sovereign Gold Bond : 2016 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్-II ఎనిమిదేళ్ల మెచ్యూరిటీ పీరియడ్ ఈనెల 28తో ముగియబోతోంది. దీంతో 8 సంవత్సరాల టర్మ్‌ను పరిగణనలోకి తీసుకొని అప్పటి గోల్డ్ బాండ్ల ఫైనల్ రిడెంప్షన్ ధరల్ని ఆర్బీఐ ప్రకటించింది. ఈమేరకు మార్చి 22న నోటిఫికేషన్ విడుదల చేసింది.
We’re now on WhatsApp. Click to Join
ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం.. 2016 సంవత్సరంలో ఇష్యూ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్ (Sovereign Gold Bond) ధర గ్రాముకు కేవలం రూ. 2916 మాత్రమే. తాజాగా దానికి ఆర్బీఐ నిర్ణయించిన ఫైనల్ రిడెంప్షన్ ధర ఒక గ్రాముకు రూ. 6601. దీంతో 8 ఏళ్ల క్రితం సావరిన్ గోల్డ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి అదిరిపోయే లాభాలు రానున్నాయి. ఈ లాభాలతో పాటు గత 8 సంవత్సరాలకు బాండ్లలోని మొత్తంపై వడ్డీని కూడా చెల్లిస్తారు. వడ్డీరేటు ప్రస్తుతం 2.50 శాతంగానే ఉండగా.. 2016లో గోల్డ్ బాండ్లు జారీ చేసిన టైంలో 2.75 శాతంగా ఉంది. ఆనాటి లెక్క ప్రకారం గోల్డ్ బాండ్ల డిపాజిటర్లకు వడ్డీ ఆదాయం సైతం లభించనుంది.
Also Read :KYC – ECI APP : ఈసీ ‘కేవైసీ యాప్’.. ఒక్క క్లిక్‌లో ఎంపీ అభ్యర్థుల సమాచారం
ఉదాహరణకు మనం 2016 సమయంలో 35 గ్రాముల సావరిన్ గోల్డ్ బాండ్ కొన్నామని అనుకుందాం.. అప్పుడు గ్రాముకు రూ. 2916 లెక్కన మొత్తం మీ పెట్టుబడి రూ. 1,02,060 అవుతుంది. ఇక ఇప్పుడు గ్రాము ధర రూ. 6601 చొప్పున మీ పెట్టుబడి రూ. 2,31,035కు చేరుతుంది. అంటే రెట్టింపు లాభాలు వస్తున్నాయి. వార్షికంగా 2.75 శాతం చొప్పున వడ్డీ ఆదాయం అదనం. దీంతో రూ. 2.50 లక్షల కంటే ఎక్కువే ఆదాయం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ గోల్డ్ బాండ్లను జారీ చేస్తుంది. ఇండియన్ బులియన్ జువెల్లర్స్ అసోసియేషన్ లిమిటెడ్ (IBJA) బంగారం ధరను నిర్ణయిస్తుంటుంది. గోల్డ్ బాండ్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాదీ సుమారు 4 సార్లు (ప్రతి త్రైమాసికానికి ఒకసారి) జారీ చేస్తుంటుంది. ఇటీవల ఫిబ్రవరి 12-16 తేదీల్లో కూడా ఇష్యూ చేసింది.