Rajinikanth – Himalayas : రజనీకాంత్ హిమాలయాల టూర్ వీడియో ఇదిగో
Rajinikanth - Himalayas : సూపర్ స్టార్ రజనీకాంత్ హిమాలయాల టూర్ విశేషాలు ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి.
- By Pasha Published Date - 04:00 PM, Sat - 2 September 23
Rajinikanth – Himalayas : సూపర్ స్టార్ రజనీకాంత్ హిమాలయాల టూర్ విశేషాలు ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి. ఇటీవల ఆయన బద్రీనాథ్ క్షేత్రాన్నిసందర్శించుకున్నారు. అక్కడి నుంచి ఉత్తరాఖండ్ అల్మోరాకు వెళ్లి మహావతార్ బాబా గుహ దగ్గర అరగంటపాటు ధ్యానం చేశారు. అక్కడి ఆశ్రమంలోని సాధువులతో సంభాషించారు. 73 ఏళ్ల వయసు కలిగిన రజనీకాంత్ తనతో ఉన్న ఇద్దరు ముగ్గురు పోలీసులు, ఒకరిద్దరు అసిస్టెంట్లతో కలిసి చేతిలో కర్ర పట్టుకుని యువకుడిలా పర్వతాలను ఎక్కుతూ మహావతార్ బాబా గుహ దాకా వెళ్లారు.
ద్వారహత్ నుంచి మహావతార్ బాబా గుహ దాకా కొండలు, గుట్టలే ఉంటాయి. సరైన రోడ్లు ఉండవు. ఇలాంటి దారిలో కేవలం ఒకటి రెండు చోట్ల మాత్రమే ఆయన పోలీసుల సాయం తీసుకున్నారు. మధ్య మధ్యలో ఆగుతూ అభిమానులకు సెల్ఫీలు (Rajinikanth – Himalayas) ఇచ్చారు. రజనీకాంత్ ఈ గుహను సందర్శించిన వీడియోను ఒక వ్యక్తి ‘Divine tushar worldwide’ అనే ఛానల్ లో అప్ లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.