17 Trains Cancelled : మే 21న 17 రైళ్లు రద్దు.. ఏవేవి అంటే ?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మే 21వ తేదీన 17 రైళ్లను రద్దు చేస్తున్నట్లు(17 Trains Cancelled) దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
- By Pasha Published Date - 11:57 AM, Fri - 19 May 23

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మే 21వ తేదీన 17 రైళ్లను రద్దు చేస్తున్నట్లు(17 Trains Cancelled) దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు ఓ ప్రకటనలో కోరారు. ఘట్‌కేసర్-చర్లపల్లి మధ్య చర్లపల్లి కోచింగ్ టెర్మినల్ నిర్మాణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు (17 Trains Cancelled) చేయాల్సి వచ్చిందన్నారు. దీంతో సికింద్రాబాద్-వరంగల్, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-కాజీపేట, కాచిగూడ-మిర్యాలగూడ, నడికుడి-మిర్యాలగూడ, గుంటూరు-వికారాబాద్, సికింద్రాబాద్-రేపల్లె, హైదరాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్, సికింద్రాబాద్-గుంటూరు, సికింద్రాబాద్-సిర్పూజ్ కాగజ్ నగర్ రైళ్లను రద్దు చేశామన్నారు. మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు తెలిపారు.
ఈనేపథ్యంలో మే 20, 21 తేదీల్లో హౌరా-సికింద్రాబాద్, త్రివేండ్రం-సికింద్రాబాద్, సికింద్రాబాద్-మన్మాడ్ రైళ్లు సహా మరో ఐదు రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని చెప్పారు. హౌరా-సికింద్రాబాద్ రైలు (12703) ఈనెల 20న ఉదయం 8.35 గంటలకు బయలుదేరాల్సి ఉండగా.. దాని టైంను 11.35 గంటలకు మార్చారు. సికింద్రాబాద్-మన్మాడ్ రైలు రాత్రి 18.50 గంటలకు బయలుదేరాల్సి ఉండగా.. దాని టైం ను రాత్రి 9.50 గంటలకు మార్చారు. మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరాల్సిన భూషణేశ్వర్-ముంబై ట్రైన్ 6.20కి బయలుదేరుతుంది.వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ నుంచి దానాపూర్ (బీహార్), దిబ్రూగఢ్ (అస్సాం)లకు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.