Sonu Sood : నాలుగు కాళ్ళు, నాలుగు చేతులతో పుట్టిన పాపకు సర్జరీ.. సోనూ సూద్ ఉదారత
రియల్ హీరో, ఆపద్బాంధవుడిగా ప్రజల్లో పేరు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్ .. మళ్లీ తన ఉదారతను చాటుకున్నారు.
- By Hashtag U Published Date - 06:30 PM, Sat - 11 June 22
రియల్ హీరో, ఆపద్బాంధవుడిగా ప్రజల్లో పేరు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్ .. మళ్లీ తన ఉదారతను చాటుకున్నారు. బిహార్ లోని చేవాడ జిల్లాలో నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో పుట్టిన చౌముఖి అనే రెండున్నరేళ్ల చిన్నారికి శస్త్ర చికిత్స చేయించారు. వివరాల్లోకి వెళితే.. నాలుగు కాళ్ళు, నాలుగు చేతులతో పుట్టిన చౌముఖి తన వయస్సులో ఉన్న ఇతర పిల్లల మాదిరిగా ఆడుకోలేదు.. బడికి వెళ్లలేదు. ఈ చిన్నారి తల్లిదండ్రులు నవాడాలో రోజువారీ కూలీలుగా పని చేస్తున్నారు. వాళ్ళు ఇటీవల తమ బిడ్డ వైద్య సహాయం కోసం SDO కార్యాలయాన్ని ఆశ్రయించారు. అక్కడ ఉన్న వారిలో ఒకరు పాప పరిస్థితిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ విషయం పాప తల్లిదండ్రులకు కూడా తెలియదు. సోనూ సూద్ ఈ వీడియోను చూసి చలించిపోయారు. వెంటనే చౌముఖి తల్లిదండ్రులను సంప్రదించడానికి తన బృందాన్ని నవాడకు పంపాడు. బాలికను శస్త్రచికిత్స నిమిత్తం సూరత్‌లోని ఓ హాస్పిటల్ కు తరలించారు. ఈ సర్జరీ సక్సెస్ ఫుల్ గా జరిగింది. ఇప్పుడు చౌముఖి.. అందరు పిల్లల్లా సాధారణ జీవితాన్ని గడుపుతోంది. సోనూసూద్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో.. సర్జరీ తర్వాత ఆస్పత్రి బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్న ఆ పాప ఫోటోను షేర్ చేశాడు. శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినందుకు సూరత్‌లోని కిరణ్ ఆసుపత్రి వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. చౌముఖి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డకు కొత్త జీవితాన్ని అందించినందుకు సూద్‌కి కృతజ్ఞతలు తెలిపారు. నెటిజన్లు సోనూ సూద్ చేసిన సాయాన్ని ప్రశంసిస్తున్నారు.
Tags
Related News
KKR vs SRH: షారుఖ్ ఖాన్ స్మోకింగ్ వీడియో వైరల్
స్మోకింగ్ అలవాటున్న షారుఖ్ ఖాన్ బహిరంగంగానే సిగరెట్ తాగుతుంటాడు. గతంలో ముంబై విమానాశ్రయంలో స్మోక్ చేస్తూ కనిపించాడు. అప్పట్లో అది వివాదానికి దారి తీసింది.