Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Trending News
  • ⁄Snails Like Ghosts A New Type Of Lockdown In Florida In America

Big Size Snails: ఫ్లోరిడా ప్రజలను వణికిస్తున్న నత్తలు.. దెబ్బకు లాక్ డౌన్?

సాధారణంగా మనం సముద్ర తీరాలలో, చిన్న చిన్న కాలువలలో, నదుల ప్రాంతాలలో నత్తలను చూస్తూ ఉంటాం.

  • By Nakshatra Published Date - 08:15 AM, Sat - 16 July 22
Big Size Snails: ఫ్లోరిడా ప్రజలను వణికిస్తున్న నత్తలు.. దెబ్బకు లాక్ డౌన్?

సాధారణంగా మనం సముద్ర తీరాలలో, చిన్న చిన్న కాలువలలో, నదుల ప్రాంతాలలో నత్తలను చూస్తూ ఉంటాం. అయితే నత్తలు పట్టుకోవడానికి దగ్గరికి వెళ్ళగానే తాబేలు లాగా లోపలికి ముడుచుకుంటాయి. ఇంకొన్ని అయితే బండరాళ్లకు గట్టిగా అతుక్కుంటాయి. కొంతమంది నత్తలను ధైర్యంగా పట్టుకోగా ఇంకొందరు మాత్రం భయపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే నత్తలు మాత్రం ఏకంగా ఎలుకల పరిమాణం వరకు పెరుగుతాయట. అయితే నత్తలే కదా అని అనుకుంటే మాత్రం పొరపాటు పడినట్లే. ఎందుకంటే ఈ నత్తలు అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రజలను వణికిస్తున్నాయి. అంతేకాకుండా ఈ నత్తల దెబ్బకు లాక్ డౌన్ ఆంక్షలు కూడా విధించారు. పూర్తి వివరాల్లోకి వెళ్ళితే.. జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నెయిల్ జాతికీ చెందిన నత్తలు పరిమాణంలో చాలా పెద్దవి.

ఎనిమిది అంగుళాల పొడవు ఉండి, తొమ్మిదేళ్ల పాటు జీవిస్తాయి. అయితే ఇవి కేవలం నీటిలోనే కాకుండా భూమి పైన మొక్కలు, చెట్ల ఆకులను తింటూ బతుకుతుంటాయి. అయితే నిజానికి అవి కేవలం ఆఫ్రికా దేశాలకే పరిమితమై ఉండేవి. కానీ 1960 సమయంలో ఓడల్లో సరుకుల ద్వారానో, పెంచుకునేందుకు, తినేందుకు తెచ్చుకునే మనుషుల ద్వారానో అమెరికాకు చేరాయి. ఆ తర్వాత అక్కడక్కడా తమ సంతతిని ఒక్కసారిగా పెంచుకుంటూ భయోత్పాతం సృష్టిస్తున్నాయి. మొదట అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడా ప్రాంతంలో 1960లో వీటి సంతతి విజృంభించింది. అప్పట్లోనే ఆ ప్రదేశంలో నత్తలను నిర్మూలించేందుకు పదేళ్ల పాటు చర్యలు తీసుకుని, ఎనిమిది కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి వచ్చింది. అయినా వాటి గుడ్ల ద్వారా అక్కడక్కడా మళ్లీ విజృంభిస్తూనే వస్తున్నాయి.

ఒక్కో నత్త ఏడాదికి 1,200 గుడ్లు పెట్టి పిల్లలను కంటుంది, మళ్లీ ఈ పన్నెండు వందల నత్తలు ఒక్కోటీ 1,200 పిల్లలను కంటాయి. అంటే ఒక్క నత్త నుంచి రెండేళ్లలో 14.40 లక్షల నత్తలు పుడతాయన్నమాట. ఈ నత్తలు దాదాపు 500 రకాల మొక్కలను తింటాయి. అందువల్ల ఈ నత్తలు ఉన్న చోట ఏ రకం పంట అయినా, తోటలు అయినా దెబ్బతినడం ఖాయం. ఆఫ్రికన్ జెయింట్ నత్తలపై ఉండే సూక్ష్మజీవులతో మనుషుల్లో మెనింజైటిస్ వ్యాధి వస్తుంది. ఈ నత్తలు కాంక్రీట్ ను కూడా తింటాయని దీనితో భవనాలు, ఇతర నిర్మాణాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని అమెరికా వ్యవసాయ శాఖ ప్రకటించింది. అలా ప్రస్తుతం అమెరికాకు ఆఫ్రికన్ జెయింట్ నత్తలు పెద్ద సమస్యగా మారాయి. లాక్ డౌన్ విషయానికి వస్తే..ఇటీవల ఫ్లోరిడాలోని పోర్ట్ రిచీ పట్టణంలో జెయింట్ నత్తలను గుర్తించారు.

ఈ నత్తల గుడ్లు మట్టి, మొక్కలు, కలప తరలింపు వంటి మార్గాల ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉండటంతో వెంటనే ఆ ప్రాంతంలో రెండేళ్ల పాటు ఒక రకం లాక్ డౌన్ ను పెట్టారు. ఆ ప్రాంతం నుంచి ఎలాంటి మొక్కలు, మట్టి, చెత్త, ఇంటి, భవన నిర్మాణ సామగ్రి, పంటలకు సంబంధించిన ఎలాంటి ఉత్పత్తులు, సామగ్రిని బయటికి తీసుకెళ్లకుండా నిషేధం విధించారు. పొలాలు, తోటల్లో వినియోగించే వాహనాలను కూడా పూర్తిగా సర్వీసింగ్ చేసిన తర్వాతే ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాలని ఆదేశించారు. పోర్ట్ రిచీ పట్టణంలోని అన్ని ప్రాంతాలు, పొలాలు, తోటలు, ఉద్యానవనాల్లో నత్తలను చంపేసే రసాయనాలను కూడా చల్లుతున్నారు.

Tags  

  • africa
  • African Snails
  • Florida
  • International
  • Jiant Snails
  • lockdown
  • Offbeat
  • Snails
  • USA
  • wild life

Related News

Whatsapp: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. ఆన్లైన్ లో ఉన్నట్టు కనిపించేది ఆ కొందరికి మాత్రమే?

Whatsapp: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. ఆన్లైన్ లో ఉన్నట్టు కనిపించేది ఆ కొందరికి మాత్రమే?

వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం

  • Mother And Son: కొడుకు కోసం చదివి ఒకేసారి ఉద్యోగాలు కొట్టిన తల్లి కొడుకు..!

    Mother And Son: కొడుకు కోసం చదివి ఒకేసారి ఉద్యోగాలు కొట్టిన తల్లి కొడుకు..!

  • FBI Raids : డొనాల్డ్ ట్రంప్ నివాసంలో ఫెడరల్ బ్యూరో అధికారుల సోదాలు

    FBI Raids : డొనాల్డ్ ట్రంప్ నివాసంలో ఫెడరల్ బ్యూరో అధికారుల సోదాలు

  • Viral Video: ఏనుగులతో సెల్ఫీకి యత్నం.. ఉరిమి తరిమేశాయి!!

    Viral Video: ఏనుగులతో సెల్ఫీకి యత్నం.. ఉరిమి తరిమేశాయి!!

  • Viral Video : వాట్ ఏ ఐడియా…చేయి కదపకుండా..వలలోకి వచ్చిపడుతున్న చేపలు..వైరల్ వీడియో!!!

    Viral Video : వాట్ ఏ ఐడియా…చేయి కదపకుండా..వలలోకి వచ్చిపడుతున్న చేపలు..వైరల్ వీడియో!!!

Latest News

  • Harika Dronavalli : హ్యాట్సాఫ్ హారిక…9 నెలల గర్భంతో కాంస్యం నెగ్గావ్…!!

  • Gaddar : సోషల్ మీడియాను ఊపేస్తోన్న గద్దర్ పాట…మీరూ చూడండి..!!

  • Balineni Srinivas Reddy : మాజీ మంత్రి `బాలినేని` రాజ‌కీయం భ‌లేభ‌లే!

  • IMD : మరోవారం రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు..ఆ జిల్లాలకు హెచ్చరిక!!

  • Rakul Sexy Video : వాహ్….వాట్ ఏ అందం…రకుల్ వీడియో వైరల్..!!

Trending

    • 6000cr: వ్యక్తి ఖాతాలో రూ.6 వేల కోట్లు.. అసలు ఎలా వచ్చాయంటే?

    • Pak Woman: గర్భవతి అని కూడా చూడకుండా దారుణంగా కొట్టిన సెక్యూరిటీ గార్డ్.. వైరల్ వీడియో?

    • Corona End Predicted: కరోనా అంతం అయ్యేది అప్పుడేనట.. చైనా నోస్ట్రాడమస్ చెప్పిన నిజాలు ఇవే!

    • Dog Funeral: పెంపుడు కుక్కకు ఘనంగా వీడ్కోలు.. వీడియో వైరల్?

    • Covid: ఎనిమిది మందిలో ఆ ఒక్కరికి లాంగ్ కోవిడ్ లక్షణాలు.. పూర్తి వివరాలు మీకోసం!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: