Sweden Championship: రతి క్రీడలో పాల్గొనండి.. బహుమతులు గెలుచుకోండి!
యూరోపియన్ సెక్స్ ఛాంపియన్ షిప్ పేరిట ఈ నెల 8 నుంచి గోతెన్ బర్గ్ లో రతి క్రీడల పోటీలు నిర్వహించనుంది.
- By Balu J Published Date - 11:42 AM, Mon - 5 June 23
క్రీడలు అనగానే ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, కామన్ వెల్త్ లాంటి ప్రతిష్టాత్మకమైన స్పోర్ట్స్ గుర్తుకు వస్తాయి. కానీ యూరోపియన్ కంట్రీలో ఇందుకు భిన్నంగా సెక్స్ చాంఫియన్ షిప్ పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. మొదటి యూరోపియన్ సెక్స్ ఛాంపియన్ షిప్ పేరిట ఈ నెల 8 నుంచి గోతెన్ బర్గ్ లో రతి క్రీడల పోటీలు నిర్వహించనుంది. స్వీడన్ సెక్స్ ఫెడరేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. మొత్తం ఆరు వారాల పాటు పోటీలు జరుగుతాయి. మొత్తం 16 రకాల విభాగాల్లో (డిసిప్లెన్స్) సెక్స్ క్రీడల పోటీలు నిర్వహిస్తారు. సమ్మోహనం, ఓరల్ సెక్స్, ఓర్పు, బాడీ మర్థన, ఫోర్ ప్లే ఇలా ఎన్నో విభాగాలను ఖరారు చేశారు. ప్రతి రోజూ ఆరు గంటల పాటు క్రీడా సెషన్ లు ఉంటాయి.
విడిగా ఒక్కో మ్యాచ్ 45 నిమిషాల నుంచి 60 నిమిషాల పాటు ఉంటుంది. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి 20 మంది పోటీల్లో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. విజేతను ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ప్యానెల్ నిర్ణయిస్తుంది. పోటీలు చూసేందుకు ప్రేక్షకులను కూడా అనుమతించనున్నారు. విజేతల ఎంపికలో ప్రేక్షకుల పాత్ర కూడా ఉంటుంది. ఇద్దరి మధ్య కెమెస్ట్రీ, సెక్స్ పట్ల ఉన్న పరిజ్ఞానం తదితర అంశాలు తుది విజేతను నిర్ణయించనున్నాయి. సెక్స్ చాంఫియన్ పోటీలు ప్రస్తుతం అన్ని దేశాలను ఆకర్షిస్తున్నాయి. త్వరలో ఇలాంటి రతి పోటీలు ఇతర దేశాల్లో నిర్వహించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Also Read: TSPSC Group 1: TSPSC గ్రూప్ -1 ప్రిలిమ్స్ రాస్తున్నారా.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!
Related News
Vidya Balan: స్మోకింగ్ అలవాటుపై విద్యాబాలన్ సంచలన వ్యాఖ్యలు.. కామెంట్స్ వైరల్!
Vidya Balan: 2011లో ‘ది డర్టీ పిక్చర్’ అనే విజయవంతమైన చిత్రంలో నటించిన తర్వాత నటి విద్యాబాలన్ కు ధూమపాన వ్యసనం బారిన పడింది. పొగ వాసన అంటే తనకు ఇష్టమని, అయితే అది తన ఆరోగ్యానికి హాని కలిగించకపోతే మాత్రమే ధూమపానం చేస్తానని ఆమె అంగీకరించింది. 1980ల నాటి దక్షిణాది నటి సిల్క్ స్మిత పాత్రలో నటించిన ఈ చిత్రంలో పనిచేసిన అనుభవాన్ని బాలన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సిల్క్ స్మితను