Hug Day Special: ప్రేమికులకు షాక్.. ఫిబ్రవరి 14న ‘కౌ హగ్ డే!
ఫిబ్రవరి 14న వాలెంటేన్ డే (valentine day) ను వ్యతిరేకించే కార్యకలాపాలకు సిద్దమవుతున్నాయి.
- By Balu J Published Date - 12:10 PM, Fri - 10 February 23

ఫిబ్రవరి నెల గుర్తుకురాగానే ప్రేమికులకు ముందుగా గుర్తుకు వచ్చేది వాలంటైన్స్ డే (Lovers Day). అయితే అదే ప్రేమికులకు వాలంటైన్స్ డే తో పాటు భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, హిందూత్వ సంఘాలు కూడా గుర్తకువస్తాయి. ఎందుకంటే ప్రేమికుల దినోత్సవం ఫారిన్ కంట్రీకి సంబంధించినదనీ, ఇండియన్ (Indian Culture) కల్చర్ కాదని వాళ్ల వాదన. ఈ కారణంతోనే కొందరు లవర్స్ డే పై ఆంక్షలు విధిస్తూ ఎక్కడికక్కడ ప్రేమికులను కట్టడి చేస్తుంటారు. ఇంకొందరు చేతిలో పుస్తెల తాళ్లు పెట్టుకొని ప్రేయసీ ప్రేమికులను పెళ్లుళ్లు కూడా చేస్తారు. ఈ నేపథ్యంలో చాలా కాలంగా వాలెంటేన్ డే మీద దాడులు చేస్తున్న హిందుత్వ సంఘాలు ఈ సారి కూడా ఫిబ్రవరి 14న వాలెంటేన్ డే (valentine day) ను వ్యతిరేకించే కార్యకలాపాలకు సిద్దమవుతున్నారు.
‘కౌ హగ్ డే’
కేంద్ర ప్రభుత్వం (Central Government) కూడా వాలెంటేన్ డే ను పలచన చేయడానికి దానికి పోటీగా ఫిబ్రవరి 14ని ‘కౌ హగ్ డే’ (Hug Day) గా జరుపుతోంది. పశుసంవర్ధక,ఫిషరీస్, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జాతీయ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు ఈ రోజు ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో ఫిబ్రవరి 14ని ‘కౌ హగ్ డే’గా జరుపుకోండి అని పిలుపునిచ్చింది. వైదిక సంప్రదాయం, ఆవు వల్ల ఉన్న అపారమైన ప్రయోజనాలను ప్రజలందరికీ తెలియజేసే లక్ష్యంతో, భారత జంతు సంక్షేమ బోర్డు ఫిబ్రవరి 14న ‘కౌ హగ్ డే’ (Hug Day) ని జరుపుకోవాలని ప్రజలను కోరింది. “ఆవు భారతీయ సంస్కృతికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, అది మన జీవితాన్ని నిలబెడుతుందని, పశువుల సంపద, జీవవైవిధ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుందని మనందరికీ తెలుసు. మానవాళికి సకల సంపదలను అందించే పోషక స్వభావం ఉన్నందున దీనిని “కామధేను” , “గోమాత” అని పిలుస్తారు. ”అని జంతు సంక్షేమ బోర్డు (Animal Board) తన ప్రకటనలో తెలియజేసింది.
యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ సంచలనం
పాశ్చాత్య సంస్కృతి (Foreign Culture) కారణంగా వైదిక సంప్రదాయాలు అంతరించిపోయే అంచున ఉన్నాయని ఆ ప్రకటన పేర్కొంది. “పాశ్చాత్య నాగరికతకున్న ఆకర్షణ మన సంస్కృతి, వారసత్వాన్ని దాదాపు మరచిపోయేలా చేసింది” అని బోర్డు పేర్కొంది. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ప్రకటన ప్రకారం, ఆవు వల్ల కలిగే అపారమైన ప్రయోజనాల కారణంగా, ఆవులను కౌగిలించుకోవడం గొప్ప భావోద్వేగాన్ని కలుగజేస్తుంది. వ్యక్తిగత, సామూహిక ఆనందాన్ని పెంచుతుంది. “అందుకే, ఆవు ప్రేమికులందరూ కూడా ఆవు యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, జీవితాన్ని సంతోషంగా, పాజిటీవ్ శక్తితో నింపడానికి ఫిబ్రవరి 14ని కౌ హగ్ డే (Hug Day)గా జరుపుకోవాలి” అని ప్రకటన పేర్కొంది. అయితే ఈ నేపథ్యంలో కౌ హగ్ డే పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమికులు ఈ చర్యను వ్యతిరేకిస్తూ.. ‘ఆవులు అంటే మాకు ఇష్టమే కానీ.. అవి ఎగిరి ఒక తన్ను తంతే ఆ బాధ్యత’ ఎవరిది అంటూ ట్రోల్ చేస్తుండగా, హిందు సంఘాలు మాత్రం కౌ హగ్ డే బాగుందని రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Ram charan and KTR: కేటీఆర్, రామ్ చరణ్ ప్రత్యేక భేటీ!