International Nurses Day : వైద్యరంగంలో నర్సుల సేవలు వెలకట్టలేనివి : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
నర్సులు అందించే సేవలు అనన్యసామాన్యమైనవి. ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో వారు చేసే సేవలు వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నాయి. రోగుల ఆరోగ్య పునరుద్ధరణలో నర్సుల పాత్ర కీలకమైనది. నిస్వార్థంగా చేసే వారి సేవలను విలువలతో కొలవలేం.
- By Latha Suma Published Date - 12:31 PM, Mon - 12 May 25

International Nurses Day : అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నర్సుల సేవలను అభినందిస్తూ మంగళగిరిలో జరిగిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నర్సులతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నర్సులు అందించే సేవలు అనన్యసామాన్యమైనవి. ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో వారు చేసే సేవలు వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నాయి. రోగుల ఆరోగ్య పునరుద్ధరణలో నర్సుల పాత్ర కీలకమైనది. నిస్వార్థంగా చేసే వారి సేవలను విలువలతో కొలవలేం. ఒక్క నర్సు స్పర్శ కూడా రోగిలో సానుభూతిని, ధైర్యాన్ని కలిగిస్తుంది ” అన్నారు.
Read Also:Hyderabad : హైదరాబాద్ లో రూ.50 లక్షలకే ఆపార్టుమెంట్..ఎక్కడో తెలుసా..?
సమావేశంలో ఎనిమిది మంది ఉత్తమ సేవలందించిన స్టాఫ్ నర్సులను పవన్ కల్యాణ్ సత్కరించారు. వారి సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భాన్ని ఒక మధురమైన జ్ఞాపకంగా మలిచారు.“కొవిడ్ సమయంలో నర్సులు ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వహించిన తీరును మనం ఎప్పటికీ మర్చిపోలేము. మీ శ్రమను నేను గుండెతొ గుర్తుపెట్టుకున్నాను. ఇటీవల సింగపూర్‌లో నా కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురయ్యే సందర్భంగా అక్కడి నర్సులు చూపిన సేవల ద్వారా మీలాంటి సేవాదారుల కృషిని మళ్లీ గుర్తుచేసుకున్నాను. మీరు చేస్తున్న సేవలు నిజంగా మరపురానివి” అని పేర్కొన్నారు.
నర్సుల సమస్యలపై స్పందించిన ఆయన, “మీరు చెప్పిన ప్రతి విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్తాం. ఈ వృత్తిలో ఉండే వ్యక్తుల సంక్షేమం ఎంతో అవసరం. వారి శ్రేయస్సు కోసం ప్రభుత్వమే ముందడుగు వేయాలి” అని అన్నారు. పవన్ కల్యాణ్ హాజరైన ఈ సమావేశం నర్సుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. వారి సేవలను గుర్తించి, మరింత ఆదరణ చూపించాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం మరోసారి గుర్తుచేసింది.
Read Also: Kavitha : అప్పులు, వ్యయంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎమ్మెల్సీ కవిత