Schoolboy Turns Reporter: రిపోర్టర్ గా మారిన స్కూల్ స్టూడెంట్.. ఇంటర్నెట్ లో వీడియో వైరల్!
జార్ఖండ్‌లోని భిఖియాచక్ గ్రామంలో ఒక బాలుడు తాను చదువుకునే పాఠశాలలో
- Author : Balu J
Date : 06-08-2022 - 1:16 IST
Published By : Hashtagu Telugu Desk
జార్ఖండ్‌లోని భిఖియాచక్ గ్రామంలో ఒక బాలుడు తాను చదువుకునే పాఠశాలలో అపరిశుభ్ర పరిసరాలపై వీడియో రూపొందించి రిపోర్టర్‌గా మారాడు. అస్తవ్యస్తంగా మారిన తరగతి గదులు, మురికి గా మారిన వాష్‌రూమ్‌లు, పనిచేయని చేతి పంపు దుస్థితిని బయటి ప్రపంచానికి చూపేందుకు 12 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ రిపోర్టర్‌గా మారాడు. తన పాఠశాలలో పాఠశాల అధ్వాన్నమైన పరిస్థితిని వివరిస్తూ పాఠశాలకు సంబంధించిన వీడియోను కళ్లకు కట్టాడు ఈ స్కూల్ స్టూడెంట్. కర్ర, ఖాళీ కోక్ బాటిల్ ను మైక్ గా ఉపయోగించుకున్నాడు. ప్రభుత్వం స్పందించి పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇప్పుడు ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆ కుర్రాడి వీడియో చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే.