Marina Ovsyannikova : యుద్ధం వద్దంటూ లైవ్‌టీవీలో వచ్చిన జర్నలిస్ట్ ఏమయిందో తెలుసా?
ఉక్రెయిన్ లో రష్యా దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. రష్యాను తీరును పలు దేశాలు తప్పుబట్టాయి.
- By Hashtag U Published Date - 02:44 PM, Wed - 16 March 22

ఉక్రెయిన్ లో రష్యా దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. రష్యాను తీరును పలు దేశాలు తప్పుబట్టాయి. కొన్ని దేశాలు మాత్రం తటస్థంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే…రష్యా ప్రభుత్వానికి సొంత పౌరుల నుంచే తీవ్ర నిరసన సెగ తగులుతోంది. ఇప్పటికే పౌరులు పెద్దెత్తున ఆందోళనలు చేపట్టారు. వారిని నిర్భంధంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా రష్యా ప్రభుత్వ నియంత్రణలో మీడియ సంస్థ ఛానెల్ వన్ ఎడిటర్ రష్యాకు వ్యతిరేకంగా లైవ్ లోనే నిరసన గళం వినిపించారు. యుద్దం వద్దంటూ ఆమె ఓ పోస్టర్ పట్టుకుని స్క్రీన్ మీదకు వచ్చారు. వెంటనే ఆ ఛానెల్ మరో ఫుటేజీ ని చూపెట్టింది. అయితే ఆమెపై రష్యా ప్రభుత్వం కఠిన చర్యలకు పాల్పడుతోంది. 15 ఏళ్లపాటు ఆమెకు జైలు శిక్ష విధంచే అవకాశం ఉందని తెలుస్తోంది.

Marina Ovsyannikova
న్యూయార్క్ టైమ్స్ పోస్టు చేసిన వీడియో ప్రకారం, ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణను తాను ప్రశ్నించానాని మెరీనా ఒవ్ స్యన్నికోవా తెలిపారు. తనను 14 గంటలపాటు విచారించారన్నారు. కనీసం తమ కుటుంబ సభ్యులను సంప్రదించడానికి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. తనకు న్యాయపరమైన సహాయం అందలేదని తెలిపారు. యుద్దానికి వ్యతిరేకంగా తాను నిర్ణయం తీసుకున్నారని…ఉక్రెయిన్ రష్యా దురక్రమించడాన్ని తనకు ఇష్టం లేదని వివరించారామె. ఇది చాలా దారుణం అన్నారు. ఈ నిర్ణయాన్ని అమలు చేసినందుకు సహకరించిన తన తోటి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. తన జీవితంలో ఇవి చాలా కఠినమైన రోజులుగా చెప్పారామె.
⚡️⚡️ ПРОПАГАНДИСТЫ ОТРЕКАЮТСЯ ОТ ПУТИНА https://t.co/d2HrrQGd5h
— Кира Ярмыш (@Kira_Yarmysh) March 14, 2022
ఓ అధికార మీడియా ఛానెల్లో ఓ ఉద్యోగి యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ పోస్టర్ ను చేతపట్టుకుని లైవ్ లోకి వచ్చింది. అక్కడున్న తోటి సిబ్బంది పక్కకు తీసుకెళ్లి ఫుటేజి మార్చారు. ఆ తర్వాత ఆమెను కస్టడిలోకి తీసుకున్నారు. ఆ ఛానెల్లో రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారం అయ్యే న్యూస్ షో టైమ్ ను లక్షలాది మంది వీక్షిస్తుంటారు. యాంకర్ గా యెకతెరినా ఆంద్రెయోవా ఉన్నారు. బెలారస్ తో రష్యాకు ఉన్న సంబంధాల గురించి చర్చిస్తున్నారు. బ్లాక్ ఫార్మట్ సూట్ ధరించిన ఒవ్ స్యన్నికోవా పోస్టర్ పట్టుకుని కెమెరా ముందుకు వచ్చారు. ఆ పోస్టర్ పై నో వార్ అని రాసి ఉంది. యుద్ధాన్ని ఆపంది…దుష్ప్రచారాన్ని నమ్మకండి…అంతా మీకు అబద్ధాలు చెబుతున్నారు. ఈ యుద్ధానికి రష్యన్లు వ్యతిరేకం అని ఇంగ్లీష్ సైన్ చేసి ఉంది.