#RIPCartoonNetwork : దశాబ్దాలుగా అలరిస్తూ వస్తున్న ఛానల్ ఇక కనిపించదా..?
సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ (X) లో #RIPCartoonNetwork హ్యాష్‌ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. కార్టూన్ నెట్‌వర్క్ ఛానెల్ నిజంగానే మూతపడనుందా ? #RIPCartoonNetwork హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ కావడానికి కారణాలేంటి..?
- By Sudheer Published Date - 10:03 PM, Tue - 9 July 24

ప్రస్తతం ఎవరి చేతిలో చూడు స్మార్ట్ ఫోన్స్ (Smart Phones) , ఎవరి ఇంట్లో చూసిన స్మార్ట్ టీవీ(Smart TV) లు దర్శనం ఇస్తున్నాయి. దీంతో చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్దవారి వరకు అంత తమకు కావాల్సిన వినోదాన్ని మర్చి మర్చి చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మొబైల్స్ అందుబాటులో లేని కాలంలో బాల్యాన్ని మరింత అందంగా మార్చిన ఛానల్ అంటే ‘కార్టూన్ నెట్వర్క్ ఛానల్’ అనే చెప్పాలి. గత కొద్దీ దశబ్దాలుగా ఈ ఛానల్ వినోదాన్ని పంచుతూ వస్తుంది. ముఖ్యంగా టామ్ అండ్ జెర్రీ, పోపాయ్, పవర్ ఫఫ్ గర్ల్స్, కరేజ్ ది కోవర్డ్లీ డాగ్, బెన్ 10.. ఇలా ఎన్నెన్నో వింటేజ్ షోస్ అందరికి మరవని జ్ఞాపకాలు. అటువంటి ఛానెల్ ఇప్పుడు సడెన్‌గా మూతపడనుందంటూ ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ (X) లో #RIPCartoonNetwork హ్యాష్‌ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. కార్టూన్ నెట్‌వర్క్ ఛానెల్ నిజంగానే మూతపడనుందా ? #RIPCartoonNetwork హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ కావడానికి కారణాలేంటి..? వస్తున్న వార్తలో నిజమెంత? అని అంత మాట్లాడుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కానీ ప్రచారం అవుతున్నట్లు ఈ ఛానల్ ఏమి మూతపడట్లేదు. సదరు సంస్థ అలాంటి ప్రకటనేది చేయలేదు. యానిమేషన్ వర్కర్స్ యునైటెడ్(Animation Workers Ignited) అనే ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో “కార్టూన్ నెట్‌వర్క్ తప్పనిసరిగా మూతపడిపోతుంది” అని ఒక యానిమేషన్ వీడియో పోస్ట్ చేయడంతో ఈ వార్త ట్రేండింగ్ గా మారింది. యానిమేషన్ రంగంలో ఉద్యోగాల కోతల(లేఆఫ్స్)పై అవగాహన పెంచడానికి చేసిన వీడియోతో ఈ ట్రెండ్ ప్రారంభమైంది. కరోనా అనంతరం క్షీణతలో ఉన్న కంపెనీలన్నీ లేఆప్స్ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. చిన్న చిన్న సంస్థల మొదలు అగ్ర సంస్థల వరకు ఉన్నట్టుండి వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తీసేస్తూ భయాన్ని పుట్టిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే కార్టూన్ యానిమేషన్ వర్కర్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందని, యానిమేషన్ వర్కర్స్ యునైటెడ్ చేసిన ఒక వీడియో కార్టూన్ నెట్‌వర్క్ షట్ డౌన్ కథనానికి దారితీసింది. ఈ విషయం తెలియని కార్టూన్ ప్రియులు.. #RIPCartoonNetwork హ్యాష్‌ట్యాగ్ పోస్ట్ చేస్తూ అధ్యాయం ముగిసిందంటూ సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. కానీ అలాంటిదిమి లేదని తెలిసి హమ్మయ్య అనుకుంటున్నారు.
Cartoon Network is dead?!?!
Spread the word about what’s at stake for animation!!! Post about your favorite Cartoon Network shows using #RIPCartoonNetwork
Active members of TAG can help by filling out your survey! Today (7/8) is the last day! pic.twitter.com/dHNMvA1q0A
— Animation Workers Ignited (@AWorkersIgnited) July 8, 2024
Read Also : #NBK109 : బాలకృష్ణ మూవీ సెట్ లో ప్రమాదం..హాస్పటల్ లో హీరోయిన్