Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!
యవ్వనాన్ని పొడిగించడానికి, లైఫ్ టైం ను పెంచడానికి శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు.
- By Balu J Published Date - 07:00 PM, Thu - 26 January 23

ఇవి జీవితంలో అందరికీ తప్పవు.. వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో వివిధ మార్పులు జరుగుతాయి. వృద్ధాప్యాన్ని ఆపడానికి, యవ్వనాన్ని పొడిగించడానికి, లైఫ్ టైం ను పెంచడానికి శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ శరీరంలోని DNAలో జరిగే మార్పుల వల్లే వృద్ధాప్యం వస్తుంది. ఈ DNA మార్పులను epigenetics (ఎపి జెనెటిక్స్) అంటారు. ఈ ప్రక్రియలో కృత్రిమంగా కొన్ని మార్పులు చేయడం ద్వారా ఎలుకల్లో రివర్స్ ఏజింగ్ సాధించామని హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు ప్రకటించారు. ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదిక “జర్నల్ సెల్” లో ప్రచురితం అయింది.
ఈ అధ్యయనంలో భాగంగా హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు Sirtuinsపై ప్రత్యేక దృష్టి పెట్టారు. Sirtuins అంటే.. మానవ శరీరంలో జీవక్రియలను క్రమబద్ధీకరించే సిగ్నలింగ్ ప్రోటీన్లు. దీంతోపాటు మనిషి పుట్టుకకు మూలంగా ఉండే గర్భస్థ పిండం ఆవిర్భావ ప్రక్రియ (embryogenesis) ను పరిశీలించారు. embryogenesis జరిగేటప్పుడు “yamanaka” అనే రకానికి చెందిన మూడు జీన్స్ on అవుతాయి. ఆ తర్వాత అవి of అయిపోతాయి. హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు ఎలుకలపై ల పరిశోధనలో భాగంగా ఆ మూడు “yamanaka” జీన్స్ ను on చేశారు. దీంతో ఆ ఎలుకల్లో 50 శాతానికి పైగా రివర్స్ ఏజింగ్ జరిగింది.
ఇందులో భాగంగా ఎలుకల కంటి నరాల మళ్లీ యవ్వనాన్ని పొందాయి. వాటి కంటి చూపు కొన్నేళ్ల మునుపటి స్థాయికి చేరింది. కండరాలు, మెదడు, కిడ్నీలలో కొత్త కణాలు ఉద్భవించాయి. అనంతరం ఆ ఎలుకలకు జీన్ థెరపీ చేశారు. దీంతో అవి కొన్నేళ్ల కిందటిలా చురుకుగా కదలాడాయి. అన్ని శరీర భాగాల్లోనూ వాటి శక్తి స్థాయి పెరిగింది. ఎలుకల్లో బాహ్య జన్యు మార్పులకు దారితీసే కొన్ని అంశాలను శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ జాబితాలో ఆహారం,వృద్ధాప్యం, శారీరక శ్రమ, ఊబకాయం,పొగాకు, మద్యం,పర్యావరణ కాలుష్యం, ఒత్తిడి, అంటువ్యాధులు, క్యాన్సర్ వంటి అంశాలు ఉన్నాయి.
యమనకా ఎవరు ?
శరీరంలో కణాలను సేకరించి.. వాటిని మూల కణాలు (స్టెమ్ సెల్స్) గా మార్చే ప్రోటీన్ల కాక్ టెయిల్ ను జపాన్ లోని క్యోటో యూనివర్సిటీ జీవశాస్త్రవేత్త షిన్యా యమనకా ఒక దశాబ్దం కింద కనుగొన్నారు. వాటినే ఇప్పుడు మనం “yamanaka” జీన్స్ లేదా “yamanaka factors” అని పిలుస్తున్నాం. వీటిని కనిపెట్టినందుకు ఆయనకు అప్పట్లో నోబెల్ బహుమతి కూడా లభించింది.

Related News

Odisha Temple: ఎలుకలతో దేవతమూర్తులకు నిద్రాభంగం.. అలర్ట్ అయిన పూజారులు!
పూరీలో జగన్నాథ, బలభద్ర, సుభద్ర ఆలయాల్లో ఎలుకల బెడద నెలకొంది.