PRIYANKA PRAYER : కర్ణాటక కోసం ప్రియాంక పూజలు
ఓ వైపు కర్ణాటకలో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా.. మరోవైపు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా (PRIYANKA PRAYER) ప్రత్యేక పూజలు చేశారు. సిమ్లాలోని జఖూలో ఉన్న హనుమాన్ ఆలయంలో ఆమె ఈ పూజలు(PRIYANKA PRAYER) చేశారు.
- Author : Pasha
Date : 13-05-2023 - 11:26 IST
Published By : Hashtagu Telugu Desk
ఓ వైపు కర్ణాటకలో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా.. మరోవైపు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా (PRIYANKA PRAYER) ప్రత్యేక పూజలు చేశారు. సిమ్లాలోని జఖూలో ఉన్న హనుమాన్ ఆలయంలో ఆమె ఈ పూజలు(PRIYANKA PRAYER) చేశారు. దేశం, కర్ణాటక రాష్ట్రం శాంతి, శ్రేయస్సు కోసం ప్రార్ధనలు చేశారని స్థానిక కాంగ్రెస్ నాయకులు మీడియాకు తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. కౌంటింగ్ ప్రారంభమయ్యాక గంట వ్యవధిలోనే 119 స్థానాల్లో లీడ్ కు చేరుకుంది. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ట్విట్టర్ వేదికగా ఒక జోష్ ఫుల్ ట్వీట్ చేసింది. “నేను అజేయంగా ఉన్నాను. నేను చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. అవును, నన్ను ఈరోజు ఎవరూ ఆపలేరు” అంటూ ఆ ట్వీట్ లో పార్టీ వ్యాఖ్యానించింది.
ALSO READ : LEAD AND TRAIL : ముందంజలో..వెనుకంజలో ఉన్న టాప్ లీడర్లు వీరే
130 టార్గెట్..
224 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ 130 సీట్లకుపైగా గెలుస్తుందని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ విజయం సాధించినా, ముఖ్యమంత్రి పదవి విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య భారీ సవాలు ఎదురుకావచ్చు. కాగా, 10 ఎగ్జిట్ పోల్స్‌లో రెండు కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అంచనా వేయగా, రాష్ట్రంలో హంగ్ వస్తుందని ఏడు ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి.