Housing Scheme: ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారా? కేంద్రం నుంచి రూ. 2.50 లక్షలు పొందండిలా!
ఇది కాకుండా అప్లికేషన్ మరొక పద్ధతి ఆఫ్‌లైన్‌లో కూడా ఉంది. దీని కోసం CSC లేదా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి అక్కడ నుండి దరఖాస్తు ఫారమ్‌ను తీసుకోండి.
- Author : Gopichand
Date : 10-01-2025 - 3:17 IST
Published By : Hashtagu Telugu Desk
Housing Scheme: ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం లక్ష్యం EWS, LIG కేటగిరీ ప్రజలకు మొదటి ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు కోసం సౌకర్యాలను అందించడం. ఈ పథకం (Housing Scheme) కింద కోటి కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి. PMAY-U 2.0లో రూ. 2.50 లక్షల వరకు ఇవ్వనున్నారు. మీరు ఈ పథకం ప్రయోజనాలను ఎలా పొందవచ్చు? దరఖాస్తు చేసే విధానం ఏమిటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
కోటి కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి
PMAY-U 2.0లో కోటి కుటుంబాల గృహ అవసరాలు తీర్చనున్నారు. ఈ పథకం కింద ప్రతి పౌరుడికి (పథకానికి అర్హులైన) మెరుగైన జీవితాన్ని అందించనున్నారు. ఈ పథకం కింద పౌరులకు వారి స్వంత గృహాలను నిర్మించుకోవడానికి రూ. 2.50 లక్షల సహాయం చేస్తారు. ఇది కాకుండా ఈ పథకంలో రుణ సౌకర్యం కూడా అందించబడుతుంది.
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ తర్వాత!
ఏ వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తారు?
ఈ పథకం కింద ప్రాధాన్యత ఇవ్వబడే వ్యక్తులలో వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్‌జెండర్లు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు వారు ఉన్నారు. అంతేకాకుండా ప్రధాన మంత్రి-విశ్వకర్మ యోజన కింద పారిశుధ్య కార్మికులు, వీధి వ్యాపారులు, కళాకారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, కార్మికులు, మురికివాడలు, చాల్స్ నివాసితులు కూడా దీని ప్రయోజనాన్ని పొందగలరు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY) 2.0 ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధాలుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు కోసం PMAY పోర్టల్ pmaymis.gov.in తెరిచి, ‘PMAY-U 2.0 కోసం దరఖాస్తు చేయి’పై క్లిక్ చేయండి. దీని తర్వాత, సిటిజెన్ అసెస్‌మెంట్ ఎంపిక కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోండి. ఆ తర్వాత మీరు ఏ కేటగిరీకి దరఖాస్తు చేస్తున్నారో ఎంచుకోండి. అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేసి సమర్పించండి.
ఇది కాకుండా అప్లికేషన్ మరొక పద్ధతి ఆఫ్‌లైన్‌లో కూడా ఉంది. దీని కోసం CSC లేదా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి అక్కడ నుండి దరఖాస్తు ఫారమ్‌ను తీసుకోండి. తర్వాత ఫారమ్‌ను జాగ్రత్తగా చదవండి. అభ్యర్థించిన మొత్తం సమాచారాన్ని పూరించండి. ఆ ఫారమ్‌ను అక్కడే సంబంధిత అధికారికి సమర్పించండి. అక్కడ నుండి మీకు స్లిప్ ఇస్తారు. దానిని మీరు భద్రపర్చాల్సి ఉంటుంది.