Lucky Zodiac Signs : 300 ఏళ్ల తర్వాత 3 మహా యోగాలు.. 3 రాశులకు మహర్దశ
Lucky Zodiac Signs : వినాయక చవితి పండుగ సమీపిస్తోంది. పంచాంగం ప్రకారం.. భాద్రపద మాసంలోని శుక్ల పక్షం చతుర్థి రోజున వినాయక చవితి ఫెస్టివల్ ను జరుపుకోబోతున్నాం.
- By Pasha Published Date - 03:20 PM, Wed - 13 September 23

Lucky Zodiac Signs : వినాయక చవితి పండుగ సమీపిస్తోంది. పంచాంగం ప్రకారం.. భాద్రపద మాసంలోని శుక్ల పక్షం చతుర్థి రోజున వినాయక చవితి ఫెస్టివల్ ను జరుపుకోబోతున్నాం. సెప్టెంబర్ 18న(సోమవారం) మధ్యాహ్నం 12:39 గంటల నుంచి సెప్టెంబర్ 19న (మంగళవారం) రాత్రి 8:43 గంటల వరకు వినాయక చవితి పండుగను సెలబ్రేట్ చేసుకోవచ్చు. పండుగ సందర్భంగా వినాయక విగ్రహాన్ని ఇళ్లలో, మండపాల్లో ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అయితే 300 ఏళ్ల తర్వాత అద్భుతమైన యోగం ఈసారి వినాయక చవితి పండుగ రోజున ఏర్పడబోతోంది. ఆ ఒక్కరోజే బ్రహ్మ యోగం, శుక్ల యోగం, శుభ యోగం అనే మూడు యోగాలు సంభవించనున్నాయి. ఇవి మేషం, మిథునం, మకర రాశుల వారికి బాగా (Lucky Zodiac Signs) కలిసిరానున్నాయి.
Also read :Nipah Virus Deaths: కేరళలో కోరలు చాస్తున్న నిఫా.. మూడు జిల్లాలు కంటైన్మెంట్ జోన్స్
మేష రాశి
మేష రాశి వారికి ఈ శుభ యోగాల వల్ల విజయం దక్కుతుంది. శుభవార్తలు వింటారు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టేందుకు అనుకూలమైన టైం ఇది. వ్యాపారం పెరుగుతుంది. పెండింగు పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబ జీవితం ఆనందమయంగా మారుతుంది.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ శుభ యోగాల వల్ల ఊహించని లాభాలు వస్తాయి. సానుకూల ఫలితాలు వస్తాయి. ఆదాయం పెరిగే ఛాన్స్ ఉంది. వ్యాపారులు డెవలప్ అయ్యే ఛాన్స్ వస్తుంది. దాంపత్య జీవితం ఆనందమయంగా మారుతుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
మకర రాశి
మకర రాశి వారికి వ్యాపారాల్లో కలిసొస్తుంది. సమాజంలో ఈ రాశివారికి గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పండుగ రోజున వినాయకుడికి పూజలు చేస్తే ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు బాగా కలిసొచ్చే టైం ఇది. చాలా సమస్యలు చాలా ఈజీగా పరిష్కారం అవుతాయి. పెండింగ్ పనులు క్లియర్ కావడానికి మార్గం సుగమం అవుతుంది.
గమనిక: ‘ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.