HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Pawan Videos In Top Trending

Chandrababu Oath Ceremony : పవన్ మొత్తం తనవైపు తిప్పుకున్నాడుగా..!!

పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి పాదాభివందనం చేసిన ఘటన ఈ మూడు వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియా లో టాప్ ట్రేండింగ్ లో కొనసాగుతున్నాయి

  • Author : Sudheer Date : 12-06-2024 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Videos Trenindg
Pawan Videos Trenindg

సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల కాలంలో ఏంచేసినా అది వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారం దగ్గరి నుండి ఈరోజు జరిగిన ప్రమాణ స్వీకారం వరకు..ప్రతిదీ ట్రేండింగ్ లో నిలుస్తుంది. ఇది కావాలని చేసేది కూడా కాదు..ఆలా జరిగిపోతుందంతే. కొంతమంది పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చు చేస్తుంటారు..కానీ అంత ఖర్చు పెట్టిన దాని గురించి మాట్లాడేవారు ఉండరు..కనీసం చూసేవారు కూడా ఉండరు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో ఆలా కాదు..ఆయన చేతితో జుట్టును ఆలా అన్నాసరే వైరల్ అవుతుంటుంది. అలాంటిది తన పదేళ్ల కోరిక తీరితే ఇక అభిమానులు ఊరుకుంటారా…తమ గెలుపుకన్నా ఎక్కువ వైరల్ చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు కృష్ణా జిల్లా కేసరపల్లిలో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారం జరిగింది. సీఎంగా చంద్రబాబు తో పాటు మరో 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. ఈ ప్రమాణ స్వీకర కార్యక్రమానికి దేశ ప్రధాని, కేంద్ర మంత్రులు, చిరంజీవి, రజినీకాంత్‌ సహా అత్యంత ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం మొత్తంలో పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం వీడియో..ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ ..చిరంజీవి చేతులను పట్టుకొని నిల్చువడం..అలాగే పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి పాదాభివందనం చేసిన ఘటన ఈ మూడు వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియా లో టాప్ ట్రేండింగ్ లో కొనసాగుతున్నాయి. ఎవరు చూడు ఈ వీడియోస్ నే చూస్తూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ఆ వీడియోలకు బ్యాక్ గ్రౌండ్ పలు సాంగ్స్ జోడించి తమ టాలెంట్ ను చూపిస్తూ..వారి అభిమానాన్ని కనపరుస్తున్నారు. అంత చంద్రబాబు ..లోకేష్ ప్రమాణ స్వీకారాలు వైరల్ అవుతాయని అనుకున్నారు కానీ పవన్ మొత్తం తన వైపు తిప్పేసుకున్నాడు.

మంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే వేదికపై ఉన్న మోడీ, సీఎం చంద్రబాబు , రజనీకాంత్ , చిరంజీవి సహా ఇతర పెద్దలకు నమస్కరిస్తూ వెళ్లిన పవన్ తిరిగి వస్తూ.. తన అన్నయ్య వద్ద ఆగి ఆయన పాదాలపై పడ్డారు. కింద ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న చిరంజీవి సతీమణి సురేఖ, ఆయన తనయుడు రాంచరణ్ ఈ దృశ్యం చూసి భావోద్వేగానికి గురయ్యారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత ప్రధాని మోడీ దగ్గరకి వెళ్లిన పవన్ కళ్యాణ్ .. చిరంజీవి వైపు చూపెడుతూ చెవిలో ఏదో చెప్పారు. తర్వాత మోడీని తీసుకుని తన అన్నయ్య వద్దకు వెళ్లి పరిచయం చేశారు. అనంతరం మోడీ.. చిరు, పవన్‌ల చేతులు పట్టుకుని మరీ వేదిక మధ్యలోకి తీసుకొచ్చారు. తర్వాత ముగ్గురూ చేతులు కలిపి ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం మెగా బ్రదర్స్ ఇద్దరినీ దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకున్నారు. ఈ సమయంలో చిరంజీవి ఉద్వేగానికి గురయ్యారు. పవన్‌ బుగ్గలు నిమురుతూ ఆప్యాయత చూపారు. వేదిక కింద నుంచి తన తండ్రి, బాబాయ్‌లను మోడీ పక్కన చూసి రామ్‌చరణ్ సైతం ఎమోషనల్ అయ్యారు. ఇలా ఈ వీడియోస్ అన్ని ఇప్పుడు వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.

Read Also :


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Deputy CM Pawan Kalyan
  • Pawan Kalyan
  • Pawan-Chiranjeevi-Modi

Related News

Chandrababu Pawan Kalyan

తొందర పడొద్దంటూ చంద్రబాబు, పవన్ నిర్ణయం

బుధువారం జరిగిన రెండు గంటల సుదీర్ఘ భేటీలో, రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) కుట్రలు చేస్తోందని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా రాష్ట్రంలో అశాంతిని కలిగించే ప్రయత్నం జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు

  • Pawan Kalyan Narrowly Escap

    పవన్ కళ్యాణ్ చెపితే తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తారా ? – TPCC చీఫ్ మహేష్

  • Ap Liquor Price

    మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

  • Pawan Kalyan

    పవన్ కళ్యాణ్ ను రోజు తిడితే ఎమ్మెల్సీ పదవి !!

  • Pawan Kalyan Campaign In Mu

    తెలంగాణ మున్సిపల్ బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్

Latest News

  • ఈనెల‌లో బ్యాంకులు ప‌ని చేసేది ఎన్ని రోజులంటే?!

  • KCR వ్యక్తిత్వంపై సీఎం రేవంత్ విషం చిమ్ముతున్నాడు – కేటీఆర్

  • రోజ్ డే పూలను ఎలా భద్రపరుచుకోవాలి?

  • హీరో విజయ్ కు మద్రాస్ హైకోర్టు షాక్

  • మహిళలకు శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.

Trending News

    • బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ఫిబ్రవరిలో మ‌రింత తగ్గే అవకాశం ఉందా?

    • బెన్ స్టోక్స్‌కు ఘోర ప్రమాదం.. ముఖంపై బలమైన గాయం!

    • యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

    • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

    • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd