Pakistani actress: భారత్‌ను ఓడిస్తే జింబాబ్వే కుర్రాడిని పెళ్లి చేసుకుంటా..!
ఈనెల 6న ఆదివారం ICC T20 వరల్డ్ కప్ 2022లో తమ చివరి సూపర్- 12 మ్యాచ్‌లో జింబాబ్వేతో భారత్ తలపడనుంది.
- By Gopichand Published Date - 07:50 PM, Thu - 3 November 22

ఈనెల 6న ఆదివారం ICC T20 వరల్డ్ కప్ 2022లో తమ చివరి సూపర్- 12 మ్యాచ్‌లో జింబాబ్వేతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతుంది. పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారీ రాబోయే మ్యాచ్ గురించి ట్వీట్ చేసింది. జింబాబ్వే భారత్‌ను ఓడిస్తే తాను ‘జింబాబ్వే కుర్రాడిని’ పెళ్లి చేసుకుంటానని చెప్పింది. జింబాబ్వే పాకిస్తాన్‌ను ఒక పరుగు తేడాతో ఓడించిన వారం తర్వాత ఆమె ట్వీట్ వచ్చింది.
నవంబర్ 2న బంగ్లాదేశ్‌తో భారత్ ఆడిన మ్యాచ్‌లో అతిగా ఉత్సాహంగా ఉన్న పాకిస్థాన్ అభిమాని నిరంతరం ట్వీట్ చేస్తూ ఆటలో ఓడిపోవాలని కోరుకుంది. నవంబర్ 3న సెహర్ ట్విట్టర్‌లో “తదుపరి మ్యాచ్‌లో భారత్‌ను అద్భుతంగా ఓడించినట్లయితే నేను జింబాబ్వే వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను” అని పేర్కొంది. ఈ ట్వీట్‌కు అనేక మంది యూజర్లు లైక్‌లు, రీట్వీట్‌లు చేస్తున్నారు.
I'll marry a Zimbabwean guy, if their team miraculously beats India in next match 🙂
— Sehar Shinwari (@SeharShinwari) November 3, 2022
That is okay but when will this be happeninghttps://t.co/ER2ZtRy1Q3
— ●•Gιяιѕн•● (@me_girish) November 3, 2022
Pahle naam badlo apna 😂😂 pic.twitter.com/reZVMLrDHI
— Amit Jha 🇮🇳🚩 (@amit1407) November 3, 2022