Only In India: మెరుపుల బండి..పాటలు దండి.. ఆనంద్ మహీంద్రా షేర్ చేశారండి!
అది బజాజ్ చేతక్ స్కూటర్.. ప్రతి అణువూ లైట్ల వెలుగులో మెరిసిపోతోంది.. దాని హ్యాండిల్ వద్ద అమర్చి ఉన్న స్మార్ట్ ఫోన్ లో పాటలు మార్మోగుతున్నాయి.
- By Hashtag U Published Date - 02:30 PM, Sun - 19 June 22

అది బజాజ్ చేతక్ స్కూటర్.. ప్రతి అణువూ లైట్ల వెలుగులో మెరిసిపోతోంది.. దాని హ్యాండిల్ వద్ద అమర్చి ఉన్న స్మార్ట్ ఫోన్ లో పాటలు మార్మోగుతున్నాయి. ఈ మెరుపుల బండి వీడియోను పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో షేర్ చేశారు. జూన్ 17న దీన్ని షేర్ చేయగా.. కేవలం 2 రోజుల్లోనే 3 లక్షల వ్యూస్, 18 వేలకుపైగా లైక్స్ వచ్చాయి.
ఈ వీడియో తో పాటు ఆనంద్ మహీంద్రా ఒక ఆసక్తికరమైన కామెంట్ కూడా చేశారు. “జీవితం మీరు కోరుకున్నంత రంగులమయంగా, వినోదాత్మకంగా ఉంటుంది. ఓన్లీ ఇన్ ఇండియా” అని పేర్కొన్నారు. మన ఇండియాలోని ఓ పెట్రోల్ బంకులో ఈ వీడియోను తీశారు. ఆ స్కూటర్ ను ఫోటోలు తీయడానికి, సెల్ఫీలు దిగదానికి ఎంతోమంది ఎగబడుతుండటాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. క్రియేటివితో ఈ స్కూటర్ ను కలర్ ఫుల్ గా మార్చుకున్న వ్యక్తిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Life can be as colourful and entertaining as you want it to be… #OnlyInIndia pic.twitter.com/hAmmfye0Fo
— anand mahindra (@anandmahindra) June 17, 2022
Related News

KTR On Screen: వెండితెరకు మరో డైనమిక్ హీరో!
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు టాలీవుడ్ తో మంచి సత్సంబంధాలున్నాయి. మెగా హీరో రాంచరణ్, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మిలతో స్నేహం ఉంది.