Rs 2000 Note Exchange : 2వేల నోట్ల బదిలీ డెడ్ లైన్ ముంచుకొస్తోంది.. గడువు పొడిగిస్తారా ?
Rs 2000 Note Exchange : రూ. 2000 నోట్లు మీ దగ్గర ఉన్నాయా? వాటిని మార్చుకోవడానికి మరో నాలుగు రోజుల (సెప్టెంబర్ 30 వరకు) గడువే మిగిలి ఉంది.
- Author : Pasha
Date : 26-09-2023 - 9:11 IST
Published By : Hashtagu Telugu Desk
Rs 2000 Note Exchange : రూ. 2000 నోట్లు మీ దగ్గర ఉన్నాయా? వాటిని మార్చుకోవడానికి మరో నాలుగు రోజుల (సెప్టెంబర్ 30 వరకు) గడువే మిగిలి ఉంది. వెంటనే బ్యాంకుకు వెళ్లి రూ.2వేల నోట్లను ఛేంజ్ చేసుకోండి. రూ.2000 నోట్లను దేశంలోని ఏ బ్యాంక్ బ్రాంచ్‌లోనైనా డిపాజిట్ చేయొచ్చు. అయితే ఒకేసారి రూ. 20వేల లిమిట్ ఉంది. 2000 రూపాయల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే 19న ప్రకటించింది. అప్పటి నుంచి సెప్టెంబర్ 1 వరకు దాదాపు రూ.3.32 లక్షల కోట్లు విలువైన రూ.2వేల నోట్లు ఆర్బీఐ గల్లాపెట్టెలోకి తిరిగి వచ్చేశాయి. దీంతో తాము మార్కెట్లోకి రిలీజ్ చేసిన 2వేల రూపాయల నోట్లలో 93శాతం నోట్లు తిరిగి వచ్చినట్టేనని ఆర్బీఐ వెల్లడించింది.
Also read : India Hockey Team: ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు ఘన విజయం
సెప్టెంబర్ 30 డెడ్ లైన్ లోగా పూర్తిస్థాయిలో 2వేల రూపాయల నోట్లు బ్యాంకులకు చేరే అవకాశం లేదు. దీంతో ఆర్బీఐ (Rs 2000 Note Exchange) మరోసారి నోట్ల మార్పిడి గడువు తేదీని పొడిగిస్తుందనే ప్రచారం నడుస్తోంది. కానీ, ఆర్బీఐ నుంచి మాత్రం అలాంటి ప్రకటనేదీ ఇప్పటివరకు వెలువడలేదు. ఈ నెల 28న దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు దినం. ఈనెలలో వివిధ పండుగల వల్ల బ్యాంకులు చాలా తక్కువ రోజులే పనిచేశాయి. దీంతో రూ.2000 నోట్లను బదిలీ చేసుకునే గడువును ఆర్బీఐ పొడిగిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి.