HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Nissan Preparing To Cut 20000 Jobs

Nissan : 20 వేల మంది ఉద్యోగుల కోతకు సిద్ధమవుతున్న నిస్సాన్‌.. ?

అప్పట్లోనే సంస్థ 9,000 మంది ఉద్యోగులను తొలగించగా, తాజా వార్తల ప్రకారం ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశముందని జపాన్‌ జాతీయ ప్రసార సంస్థ ఎన్‌హెచ్‌కే నివేదించింది.

  • Author : Latha Suma Date : 12-05-2025 - 6:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nissan preparing to cut 20,000 jobs?
Nissan preparing to cut 20,000 jobs?

Nissan : ప్రముఖ జపాన్‌ వాహన తయారీ సంస్థ నిస్సాన్‌ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. గ్లోబల్‌గా కార్ల విక్రయాలు తగ్గిన నేపథ్యంలో కంపెనీ తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో తమ వ్యయాలను తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో సుమారు 20,000 ఉద్యోగాలను తొలగించనున్నట్లు సమాచారం. ఇది కంపెనీలో మొత్తం ఉద్యోగులలో దాదాపు 15 శాతంకు సమానం. గతేడాది నవంబర్‌లో అమెరికా, చైనా మార్కెట్లలో అమ్మకాలు పతనమైన కారణంగా నిస్సాన్‌ లాభాలు 94 శాతం తగ్గిపోయిన విషయం తెలిసిందే. దీంతో అప్పట్లోనే సంస్థ 9,000 మంది ఉద్యోగులను తొలగించగా, తాజా వార్తల ప్రకారం ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశముందని జపాన్‌ జాతీయ ప్రసార సంస్థ ఎన్‌హెచ్‌కే నివేదించింది.

Read Also: DGMO : ముగిసిన భారత్‌- పాకిస్థాన్‌ డీజీఎంవోల చర్చలు

నిస్సాన్‌ ఇటీవల ప్రకటించిన వివరాల ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో సంస్థకు 700-750 బిలియన్ యెన్‌ నికర నష్టం వచ్చేందుకు అవకాశం ఉందని అంచనా. దీనివల్ల కంపెనీ వ్యూహాత్మకంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా, జపాన్‌లోని అడ్మినిస్ట్రేటివ్‌ విభాగంలో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులకు ముందస్తు పదవీ విరమణ అవకాశాలు ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇది జరిగితే, గత 18 ఏళ్లలో నిస్సాన్‌ ప్రవేశపెట్టిన తొలి ముందస్తు పదవీ విరమణ ప్రణాళిక ఇదే కానుంది. సంస్థ ఈ విషయంపై ఇంకా అధికారికంగా స్పందించనప్పటికీ, మే 13న విడుదలయ్యే వార్షిక ఆర్థిక ఫలితాల్లో దీనిపై స్పష్టత రావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాహన పరిశ్రమ తీవ్రమైన మార్పులను ఎదుర్కొంటున్న తరుణంలో నిస్సాన్‌ నిర్ణయాలు ఉద్యోగుల భవితవ్యంపై గణనీయ ప్రభావం చూపనున్నాయి.

Read Also: Kohli Retirement Post: విరాట్ కోహ్లీ టెస్టు రిటైర్మెంట్ పోస్ట్‌లో ఏం రాశాడో తెలుసా?

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Employees Layoffs
  • Financial Stress
  • Japan
  • Nissan
  • Vehicle manufacturing company

Related News

Tech Mahindra Layoffs

టెక్‌ మహీంద్రాలో 30వేల లేఆఫ్‌లంటూ వార్తలు..

Tech Mahindra Layoffs  ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ టెక్ మహీంద్రాలో భారీ స్థాయిలో లేఆఫ్స్ జరుగుతున్నాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏకంగా 30 వేల మందిని తొలగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలపై టెక్ మహీంద్రా కీలక ప్రకటన చేసింది. ఉద్యోగుల తొలగింపుల వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన

  • Amazon Layoffs

    అమెజాన్‌లో మరోసారి లేఆఫ్‌లు.. రోబోటిక్స్ ఉద్యోగులపై ప్రభావం

Latest News

  • రైతులకు శుభవార్త.. 13న పీఎం కిసాన్‌ నిధుల విడుదల

  • పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

  • Tirumala : తిరుమల వెళ్లే భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త

  • మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

  • Janganana 2027: ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd