Bride Slapped : పెళ్లి మండపంలోనే ఒకరినొకరు కొట్టుకున్న వధూవరులు.. సీన్ కట్ చేస్తే!
వీళ్లేం భార్యాభర్తలురా బాబు! ఇంకా పెళ్లి తంతు పూర్తికాలేదు. ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఆపలేదు. అసలు పెళ్లి మండపం దిగనే లేదు. అప్పుడే ఒకరినొకరు కొట్టేసుకున్నారు.
- By Hashtag U Updated On - 06:09 PM, Sun - 1 May 22

వీళ్లేం భార్యాభర్తలురా బాబు! ఇంకా పెళ్లి తంతు పూర్తికాలేదు. ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఆపలేదు. అసలు పెళ్లి మండపం దిగనే లేదు. అప్పుడే ఒకరినొకరు కొట్టేసుకున్నారు. ఒకరి గూబ మరొకరు గుయ్యిమనిపించారు. జుట్లు పట్టుకుని లాక్కున్నంత పని చేశారు. అసలు వాళ్లేం చేస్తున్నారో అక్కడున్న వారిరువురి తల్లిదండ్రులకు కాని, చుట్టాలు, బంధువులు, స్నేహితులకు కాని ఏమీ అర్థం కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.
ఈ ఇద్దరు వధూవరులు సంతోషంగా పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఒకరికి కోపమొస్తే.. మరొకరు తగ్గాలంటారు. కానీ ఈ ఇద్దరికీ ముక్కుమీదే కోపం ఉన్నట్టుంది. అందుకే నువ్వు తమలపాకుతో ఒక్కటిస్తే.. నేను తలుపుచెక్కతో రెండిస్తా అన్నట్టుంది వీరి వ్యవహారం. పెళ్లయిపోయింది కదా అని ఇక ఫోటోలు దిగారు. జీవితమంతా సంతోషంగా సాగాలంటూ ఒకరికొకరు స్వీట్లు తినిపించుకునే పనిలో పడ్డారు.
ముందుగా వధువు స్వీటును పట్టుకుని.. వరుడికి తినిపించబోయింది. కానీ ఆమెను, ఆ చేతిలోని స్వీటును గమనించాడో లేదో కాని.. ఆ వరుడు ఆమెవైపు చూడకుండా వేరేవారితో మాట్లాడుతుంటాడు. దీంతో ఆ వధువుకు పిచ్చ కోపం వస్తుంది. అందుకే వెంటనే ఆ స్వీటును తీసుకుని వరుడు ముఖానికి రాసేస్తుంది. దీంతో ఒక్కసారిగా బిత్తపోయిన ఆ పెళ్లికొడుకుకు కోపం పీక్ స్టేజ్ కు వెళ్లిపోయింది.
పదిమందిలో అవమానానికి గురిచేసిందన్న ఉక్రోషంతో, ఆగ్రహంతో ఆ వరుడు.. పెళ్లికూతురి గూబ గుయ్యిమనిపిస్తాడు. దీంతో నిర్ఘాంతపోయిన ఆ వధువు కూడా వెంటనే ఆ వరుడి చెంప ఛెళ్లుమనిపిస్తుంది. దీంతో ఇద్దరూ వెనక్కు తగ్గలేదు. ఒకరినొకరు కొట్టుకున్నారు. బాలీవుడ్ లో హాస్యనటుడిగా పేరుగాంచిన సునీల్ గ్రోవర్ ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది.
ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. ఇది నిజమైన పెళ్లి కాదు. వీళ్లిద్దరూ నిజమైన వధూవరులు కాదు. మైథిలి కామెడీ ఫిల్మ్ షూటింగ్ లో భాగంగా జరిగింది. అందులో ఈ కామెడీ సీన్ నెట్ లో బాగా పాపులరైంది. అందుకే #Hashtag U టీమ్.. ఈ వీడియో వెనుక నిజాన్ని బయటపెట్టడానికి ఫ్యాక్ట్ చెక్ చేసింది.
Related News

Kohli Golden Duck: విరాట్ మూడో గోల్డెన్ డక్.. వీడియో వైరల్!
ఈ ఐపీఎల్ సీజన్ లో మూడోసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్ పెట్టాడు.