Threat call against PM Modi : ప్రధాని మోదీని చంపేస్తానంటూ మహిళ బెదిరింపు
threat call against PM Modi : ఆయనను చంపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఆయుధం కూడా సిద్ధంగా ఉందని వెల్లడించడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది
- Author : Sudheer
Date : 28-11-2024 - 1:30 IST
Published By : Hashtagu Telugu Desk
ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్ (Mumbai Police receives) కు ఓ మహిళ ఫోన్ చేసి ప్రధాని మోదీపై బెదిరింపులకు (Threat call against PM Modi) పాల్పడింది. ఆయనను చంపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఆయుధం కూడా సిద్ధంగా ఉందని వెల్లడించడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య సినీ , రాజకీయ నేతలకు బెదిరింపు కాల్స్ అనేవి ఎక్కువైపోయాయి. ఇలాంటి బెదిరింపు కాల్స్ అనేవి కొన్నిసార్లు వ్యక్తిగత కారణాలు, రాజకీయ వ్యూహాలు లేదా డబ్బు కోసం చేస్తుంటారు. బెదిరింపు కాల్స్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించడానికి పోలీసులు కాల్ రికార్డులు, టెక్నికల్ ట్రేసింగ్ మరియు ఫోరెన్సిక్ విశ్లేషణను ఉపయోగిస్తారు. బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించడం వంటివి చేస్తుంటారు.
తాజాగా ప్రధాని మోదీ (PM Modi)కి హత్య బెదిరింపులు రావడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గురువారం ఉదయం ముంబై పోలీసు కంట్రోల్ రూమ్ (Mumbai Police control room)కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ప్రధాని హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు ఫోన్ చేసిన వ్యక్తి బెదిరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఫోన్‌కాల్‌ను ట్రేస్ చేయగా.. 34 ఏళ్ల మహిళ ఈ బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడిన మహిళను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సదరు మహిళ మానసిక పరిస్థితి బాగోలేదని పోలీసులు భావిస్తున్నారు.
Read Also : Farmers’ Festival : దశాబ్దం నిర్లక్ష్యం తర్వాత తెలంగాణలో రైతు సంక్షేమ రాజ్యం వచ్చింది