Multibagger Stock : రూ.లక్ష పెడితే 5 లక్షలయ్యాయి.. వారెవా సూపర్ షేర్
Multibagger Stock : స్టాక్ మార్కెట్లో పెట్టుబడి అంటే మామూలు విషయం కాదు.
- By Pasha Published Date - 09:23 PM, Wed - 6 March 24

Multibagger Stock : స్టాక్ మార్కెట్లో పెట్టుబడి అంటే మామూలు విషయం కాదు. అది ఎంతో రిస్కీ వ్యవహారం. సరైన స్టాక్ ని ఎంచుకుని సరైన సమయంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి. అలాంటి ఓ స్టాక్ కేవలం గత సంవత్సర కాలంలోనే పెట్టుబడిని మూడింతలు పెంచింది. రూ.లక్ష పెట్టిన వారికి దాదాపు రూ.5 లక్షలు వచ్చాయి. అదే.. ఎలక్ట్రోస్టీల్ కాస్టింగ్స్ లిమిటెడ్ స్టాక్. ఏడాది కిందట ఈ షేరు ధర రూ. 33.85. ఇప్పుడు దీని ధర రూ. 163.25. గత సంవత్సర కాలంలో ఈ షేరు ధర 382 శాతం పెరిగింది. ఈ ఏడాది ఒక్క జనవరి నెలలోనే దీని ధర 57 శాతం మేర జంప్ అయింది.
We’re now on WhatsApp. Click to Join
2020 సంవత్సరంలో ఈ షేరు ధర రూ. 7.55. నాటితో పోల్చుకుంటే దీని ధర దాదాపు 2061 శాతం పెరిగింది. దీని ప్రకారం 2020లో రూ.1 లక్ష పెట్టి ఈ షేర్లు కొంటే ఇప్పుడు ఆ విలువ రూ.20 లక్షలకుపైనే ఉంటుంది. గత నాలుగేళ్లలోనే ఈ షేరు లక్షను రూ.20 లక్షలు చేసింది. 2023 సంవత్సరంలో ఈ షేరు ధర ఏకంగా 190 శాతం మేర పెరిగింది. ఈ ఏడాది 2024లో ఇప్పటి వరకు 47 శాతం పెరగడం గమనార్హం. ముందు ముందు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read :Arctic Ocean Ice : ఆర్కిటిక్ సముద్రంలో నెలరోజులు మంచు మాయం!
ఎలక్ట్రోస్టీల్ కాస్టింగ్స్ కంపెనీ(Multibagger Stock) డీఐ పైప్ ఇండస్ట్రీలో పనిచేస్తుంటుంది. మనదేశంలో ఈ విభాగంలో ఎలక్ట్రోస్టీల్ కాస్టింగ్స్ కంపెనీకి 20 శాతం వాటా ఉంది. మన దేశంలో డీఐ పైప్ ప్రొడక్టులను లాంఛ్ చేసిన తొలి కంపెనీ ఇదే. 1994 సంవత్సరంలో తొలిసారిగా మనదేశ మార్కెట్లో ఈ కంపెనీ ఉత్పత్తులను విడుదల చేసింది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా డీఐ పైప్స్ , ఫిటింగ్స్ ను ఈ కంపెనీ విస్తరిస్తోంది. విదేశీ ఎగుమతుల్లోనూ ఈ కంపెనీ వాటా 60 శాతంగా ఉంది. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీల నుంచి అక్రెడిటేషన్ పొందిన భారత కంపెనీ ఇది. ఈ స్టాక్ టార్గెట్ ప్రైస్ రూ. 233. ఇవన్నీ చూసి తొందరపడి ఈ స్టాక్‌లో పెట్టుబడులు పెట్టొద్దు. స్టాక్ గురించి.. అది పనిచేసే రంగానికి సంబంధించిన తాజా పరిణామాలపై స్టడీ చేసిన తర్వాతే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు ఏ మాత్రం పనికిరాదు.