HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Mukesh Ambani Draws Nil Salary For Second Year In Row

Nil Salary for Ambani: అంబానీ శాలరీ సున్నా.. రెండేళ్లు ఫ్రీగా చెమటోడ్చిన ముకేశ్!!

కష్టపడి పనిచేస్తే జీతం తీసుకోవాలి. కానీ తన కంపెనీ కోసం బిలియనీర్ ముకేశ్ అంబానీ ఒక్క రూపాయి జీతం కూడా తీసుకోకుండా పనిచేశారు.2021 - 2022 ఆర్ధిక సంవత్సరంలో ఆయన ఫ్రీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కోసం చెమటోడ్చారు.

  • Author : hashtagu Date : 08-08-2022 - 10:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ambani Earning From IPL

కష్టపడి పనిచేస్తే జీతం తీసుకోవాలి. కానీ తన కంపెనీ కోసం బిలియనీర్ ముకేశ్ అంబానీ ఒక్క రూపాయి జీతం కూడా తీసుకోకుండా పనిచేశారు.2021 – 2022 ఆర్ధిక సంవత్సరంలో ఆయన ఫ్రీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కోసం చెమటోడ్చారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల నుంచి ముకేశ్ అంబానీ ఇలాగే జీతం పుచ్చుకోకుండా కష్టపడుతున్నారు. కరోనా మహమ్మారి సమయంలో వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినప్పటి నుంచి ఆయన తన కంపెనీ నుంచి శాలరీ తీసుకోవడం లేదు. స్వచ్చందంగానే తన రెమ్యూనరేషన్ ను వదులు కుంటున్నారు. 2020 -21, 2021-22 ఆర్ధిక సంవత్సరాల్లో వేతనాన్ని తీసుకోకుండా ముకేశ్ పని చేశారని రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డులను బట్టి వెల్లడైంది. ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో ముకేశ్ అంబానీ కంపెనీ ఛైర్మన్‌, మేనేజింగ్ డైరెక్టర్‌ హోదాలో ఎలాంటి అలవెన్స్‌లను, కమిషన్లను, స్టాక్ ఆప్షన్లను, రిటైరల్ ప్రయోజనాలను పొందలేదు.

అంతకుముందు ఇలా..

అంతకుముందు వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా, ఎండీగా 2008-09 నుంచి ఆయన రూ.15 కోట్ల వార్షిక వేతనాన్ని పొందారు. 11 ఏళ్ల పాటు ఆయన అదే వేతనాన్ని తీసుకున్నారు. గత రెండేళ్లలో ముకేశ్ అంబానీ ఎలాంటి జీతం తీసుకోనప్పటికీ.. ఆయన కజిన్లు నిఖిల్, హితల్ మేస్వానీలు రూ.24 కోట్ల చొప్పున వేతనాన్ని పొందారు. ఇందులో రూ.17.28 కోట్ల కమిషన్లు కలిసి ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఎంపీఎస్ ప్రసాద్, పవన్ కుమార్ కపిల్ రెమ్యూనరేషన్లు కాస్త తగ్గాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో..

2021-22లో ప్రసాద్ రూ.11.89 కోట్లు పొందగా.. కపిల్ రూ.4.22 కోట్లను పొందారు. అంబానీ భార్య నీతా కంపెనీ బోర్డు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సిట్టింగ్ ఫీజు కింద రూ.5 లక్షలను, కమిషన్ల కింద రూ.2 కోట్లను పొందారు. అంతకుముందు ఆమె సిట్టింగ్ ఫీజు రూ.8 లక్షలుగా, కమిషన్ రూ.1.65 కోట్లుగా ఉండేది. అంబానీతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో మేస్వానీ బ్రదర్స్, ప్రసాద్, కపిల్‌లు హోల్ టైమ్ డైరెక్టర్లుగా ఉన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • covid-19
  • mukesh ambani
  • mukesh ambani reliance industries
  • mukesh ambani RIL
  • mukesh ambani salary

Related News

New Covid

క‌రోనా కొత్త వేరియంట్‌.. చిన్న పిల్ల‌ల‌పై ప్ర‌భావం?

చికిత్స కంటే నివారణ ఎల్లప్పుడూ ఉత్తమం. తల్లిదండ్రులు సరైన సమయంలో అప్రమత్తమై కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలను సురక్షితంగా ఉంచవచ్చు.

  • New Covid Variant

    మ‌రోసారి క‌రోనా క‌ల‌క‌లం.. కొత్త వేరియంట్ పేరు ఇదే!

Latest News

  • Operation Hydra : రూ.1200 కోట్ల ప్రభుత్వ భూమికి విముక్తి.. బడా రియల్టర్లకు హైడ్రా షాక్!

  • Allu Arjun Birthday : మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ.. ఐకాన్ స్టార్‌గా ఎదిగిన వైనం

  • Tamil Nadu : చదివింది ఆరో తరగతి..ఆస్తి వెయ్యి కోట్లకు పైగానే !! AIADMK అభ్యర్థి చిట్టా !!

  • Manipur Unrest : మరోసారి మణిపుర్లో ఉద్రిక్తత

  • Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd